కెసిఆర్‌కు షాక్ మీద షాక్: తెరాసకు చంద్రశేఖర్ గుడ్‌బై?

k chandrasekhar rao
హైదరాబాద్: మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరో సభ్యుడు డాక్టర్ ఎ చంద్రశేఖర్ త్వరలో ఆ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెసు పార్టీలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన గతంలో రంగారెడ్డి జిల్లా వికారాబాద్ నుండి ప్రాతినిథ్యం వహించారు. పార్టీ మారే విషయమై గురువారం ఆయన తన నియోజకవర్గ ముఖ్య అనుచరులతో భేటీ నిర్వహించారు.

నియోజకవర్గంలోని చాలామంది నీ వెంటే ఉంటామని మద్దతు పలకడంతో ఆయన త్వరలో కాంగ్రెసు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. తెలంగాణను కాంగ్రెసు పార్టీ ఇస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరితేనే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.

ఢిల్లీలోని కాంగ్రెసు పెద్దలను సంప్రదించినప్పుడు తనకు ప్రాధాన్యమిస్తానని స్పష్టమైన హామీ లభించిందని, ఆ తర్వాతనే తెలంగాణ రాష్ట్ర సమితిని వీడేందుకు నిర్ణయం తీసుకునే విషయమై మీ ముందు ఉంచానని ఆయన అనుచరులతో చెప్పారని, కాంగ్రెసులో చేరితే భవిష్యత్తు ఉంటుందని చెప్పడంతో వారు కూడా మీ వెంటే ఉంటామని చెప్పారు.

కాగా తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఇటీవల షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. తొలుత మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి, రెండు రోజుల క్రితం మాజీ మంత్రి, సీనియర్ నేత విజయ రామారావులు కాంగ్రెసు వైపు మొగ్గు చూపుస్తున్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ వారి దార్లోనే నడుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+