నష్టం లేదన్న నాగార్జున, తిరుపతిపై చెన్నైలో కొత్త పల్లవి

Akkineni Nagarjuna
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల చిత్ర పరిశ్రమకు నష్టం ఏమీ జరగదని యువసామ్రాట్ అక్కినేని నాగార్జున చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఆయన నిర్మించిన భాయ్ చిత్రవిశేషాలు వెల్లడించడానికి శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.

సీమాంధ్రా ప్రాంతంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల వల్ల సినిమా విడుదలకు ఇబ్బందేమీ ఉండదా? అని అడిగినప్పుడు.. అన్ని ప్రాంతాల వారికీ సినిమా కావాలని, ఏమైనా సమస్యలున్నట్లు కనిపించినా, క్రమంగా అవే సర్దుకుంటాయని నాగార్జున స్పష్టం చేశారు. సినిమా అందరిదీ అన్నారు.

తిరుపతిని ఇచ్చేయండి: పిఎంకె

రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ తమదంటే తమదని ప్రాంతాలవారీ వాదులాటలు సాగుతుంటే.. మరోవైపు పిఎంకె అధ్యక్షుడు రాందాస్ కొత్త పల్లవి అందుకున్నారు. తిరుపతి తమదేనని, దాన్ని తమిళనాడులో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లోని శ్రీకాళహస్తి తదితర 8 తాలూకాలను కూడా విలీనం చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలకతీతంగా రాష్ట్రంలోని అన్నివర్గాలూ దీనికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేయాలని శనివారం ఆయన ఓ ప్రకటనలో కోరారు. ప్రత్యేక తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ సమ్మతించిన నేపథ్యంలో సరిహద్దులోని తమిళులకు అన్యాయం జరగకుండా వారు అధికంగా ఉన్న చిత్తూరు జిల్లాలోని 8 తాలూకాలను తమిళనాడులో కలపాలన్నారు. సంబంధిత తాలూకాల్లోని 200 గ్రామాల ప్రజలు ఈ డిమాండ్‌ను గట్టిగా వినిపిస్తున్నారని గుర్తు చేశారు.

సరిహద్దుల్లోని పలు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లిపోయాయని, అక్కడ తెలుగువారికన్నా తమిళం మాట్లాడేవారే అధికమన్నారు. ఏ అవసరం వచ్చినా వారంతా తమిళనాడు పైనే ఆధారపడుతున్నారని, తమిళులతోనే వారి సంబంధాలు ఎక్కువని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ డిమాండ్ ఆంధ్రా పాలకుల ఒత్తిడితో స్తబ్దుగా ఉండిపోయిందన్నారు. ప్రస్తుతం వేర్పాటువాదం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తిరుపతిసహా ఎనిమిది తాలూకాలను తమిళనాడులో కలపాలని తమిళులు మళ్లీ గళం విప్పుతున్నట్లు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+