మోడీని కలిసిన మోహన్ బాబు, బిజెపిలోకి పలువురు!

మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్నలతో పాటు ప్రముఖ నిర్మాతలు.. అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, సి కల్యాణ్, అశోక్ కుమార్, నటులు... సుమన్, అలీ, ఏవిఎస్, కోట శ్రీనివాస రావు, జగపతి బాబు, దర్శకులు.. పూరీ జగన్నాథ్, వివి వినాయక్, రామ్ గోపాల్ వర్మ, తెలుగుదేశం పార్టీ నేత, నటుడు మురళీ మోహన్, సంగీత దర్శకులు కీరవాణిలు కలుసుకున్నారు.
కాబోయే ప్రధానియే: దత్తాత్రేయ
దేశానికి కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీయేనని బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆదివారం జోస్యం చెప్పారు. దేశ ప్రజలంతా మోడీని ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారన్నారు.
బిజెపిలోకి పలువురు!
పలువురు ప్రముఖులు బిజెపి తీర్థం పుచ్చుకునే ఉద్దేశ్యంలో భాగంగానే నరేంద్ర మోడీని కలిసినట్లుగా తెలుస్తోంది. మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు తిరిగి బిజెపి గూటికి చేరుకోనున్నారని ఇప్పటికే చెబుతున్నారు. మరోవైపు మాజీ ఐపిఎస్ అధికారి గోపినాథ్ రెడ్డి కూడా బిజెపిలో చేరేందుకే కలిశారంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు మోడీని కలుసుకోవడం కూడా చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications