ఫొటోలు: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మోడీ ఇలా..

హైదరాబాద్‌: బిజెపి ప్రచార రథసారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర బిజెపి నాయకులు జి. కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, కె. లక్ష్మణ్, ఎన్. ఇంద్రసేనా రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

ఆ తర్వాత ఆయన పార్క్ హయత్ హోటల్‌కు చేరుకున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఆయన ముఖాముఖి సమావేశమయ్యారు. ఆయనను సినీ ప్రముఖులు రామ్ గోపాల్ వర్మ, వివి వినాయక్, పూరి జగన్నాథ్, అలీ, కోట శ్రీనివాస రావు కలిశారు. బిసి సంఘాల నాయకుడు ఆర్. కృష్ణయ్య ఆయనను కలిశారు. బిసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చొరవ చూపాలని ఆర్. కృష్ణయ్య మోడీని కోరారు.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) వ్యవస్థాపక నేత మందకృష్ణ మాదిగ కూడా మోడీని కలిశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు రాజ్యాంగ సవరణ చేసి, చట్టబద్ధత కల్పించేందుకు ప్రయత్నించాలని మందకృష్ణ మోడీని కోరారు. పలువురు విఐపిలు, ప్రముఖులు మోడీని కలిశారు.

బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డితో..

బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డితో..

నరేంద్ర మోడీకి హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మోడీకి సాదర స్వాగతం చెప్పారు. మోడీ హైదరాబాద్ పర్యటనపై బిజెపి చాలా ఆశలు పెట్టుకుంది.

విక్టరీ సింబల్‌తో మోడీ..

విక్టరీ సింబల్‌తో మోడీ..

బేగంపేట విమానాశ్రయంలో నరేంద్ర మోడీ విక్టరీ సింబల్‌తో అభివాదం చేశారు. ఆయన పక్కన హైదరాబాద్‌లో బిజెపిని విస్తరించడంలో విశేష కృషి చేసిన బద్దం బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు కూడా మోడీని కలిశారు.

రాష్ట్ర బిజెపి జట్టు...

రాష్ట్ర బిజెపి జట్టు...

రాష్ట్రానికి చెందిన ప్రముఖ బిజెపి నేతలతో నరేంద్ర మోడీ ఇలా ఫొటోలకు ఫోజు ఇచ్చారు. రాష్ట్రంలోని ముఖ్యమైన నేతలంతా మోడీకి స్వాగతం చెప్పడానికి బేగంపేట విమానాశ్రయానికి తరలి వచ్చారు.

కదను తొక్కడానికి సిద్ధం..

కదను తొక్కడానికి సిద్ధం..

వచ్చే ఎన్నికల కోసం కదను తొక్కడానికి తాను సిద్ధంగా ఉన్నట్లుగా మోడీ ఇలా... ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర బిజెపి నాయకుల నుంచి సాదర స్వాగతం లభించింది.

భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు

భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు

నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ను మోడీ ఫీవర్‌తో పాటు పెళ్లిళ్ల జోరు ముంచెత్తుతోంది. హైదరాబాద్, దాని చుట్టుపక్కల దాదాపు 40 వేల పెళ్లిళ్లు ఈ రోజు జరుగుతున్నాయి. మోడీ పర్యటనతో విధించి ట్రాఫిక్ ఆంక్షలు పెళ్లిళ్లకు వెళ్లేవారికి కాస్తా ఇబ్బందినే కలిగిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+