వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీలో నేను తప్ప లేరు: సబ్బం, చిరంజీవిపై ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi - Sabbam Hari
విశాఖ/విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసేందుకు తాను తప్ప ఎవరూ లేరని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సబ్బం హరి ఆదివారం అన్నారు. ఆయన ఈ రోజు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ముఖ్యమంత్రిని కావాలని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఎదురు చూస్తున్నారని ఆరోపించారు. విశాఖ అభివృద్ధిలో స్థానికేతరుల పాత్రనే ఎక్కువగా ఉందన్నారు.

తెలంగాణ ఉద్యమానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి బీజం వేశారన్న ఆరోపణలను తాను పూర్తిగా ఖండిస్తున్నానని చెప్పారు. అదే సమయంలో విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తం చేసిన అనుమానాలను తాను సమర్థిస్తున్నానని చెప్పారు. వైయస్ వేర్పాటు వాది కాదని, అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఎస్సార్సీ కోసం సంతకం పెట్టించారన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్నారన్నారు.

తెలంగాణలో కెసిఆర్ ఎన్ని సీట్లు సాధించినా ముఖ్యమంత్రి కాలేరన్నారు. అనకాపల్లిలో జగన్ పార్టీ తరఫున పోటీకి తాను తప్ప ఎవరూ లేరన్నారు. కాంగ్రెసు పార్టీకి ఇరు ప్రాంతాల్లో వచ్చే సీట్లు సున్నానే అని ఎద్దేవా చేశారు. తాను సమైక్యాంధ్ర కోసం ఇప్పటికే రాజీనామా చేశానని, మళ్లీ మళ్లీ చేయనని చెప్పారు. అబద్దాలు చెప్పడంలో కెసిఆర్ కుటుంబ సభ్యులను మించిన వారు లేరని ఎద్దేవా చేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్ కాకుండా చూస్తామన్నారు.

వైయస్ గురించి ప్రజలకు తెలుసు: అంబటి

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సమైక్యవాదో... కాదో తెలుగు ప్రజలకు తెలుసునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వేరుగా అన్నారు. తెలంగాణ విషయంలో వైయస్ పైన బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రజలను పక్కదారి పట్టించడమేనన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరుతో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేయడం విడ్డూరమన్నారు. ప్రజలకు సమాధానం చెప్పాక ఆయన యాత్ర చేయాలన్నారు.

చిరుపై మండిపడ్డ జెఏసి

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పైన సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి మండిపడింది. సీమాంధ్రలోని పద్నాలుగు విశ్వవిద్యాలయాల విద్యార్థులు భేటీ అయ్యారు. ఉద్యమ కార్యాచరణపై చర్చ జరుగుతున్న సమయంలో చిరంజీవి వైఖరిని కొందరు విద్యార్థి నేతలు తప్పు పట్టారు. ఎమ్మెల్యే కృష్ణా రెడ్డి విభేదించారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

English summary
Anakapalli MP Sabbam Hari said on Sunday that Seemandhra leaders will stall Telangana bill in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X