మోడీ స్పీచ్: హైదరాబాద్ వివాదంపై ఏం చెప్తారు?

పట్టణ, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ గ్రామాల్లో పట్టణ వసతులు కల్పించి వలసలను నివారించాలనే దృక్పథాన్ని నరేంద్ర మోడీ అవలంబిస్తూ వస్తున్నారు. ఈ స్థితిలో హైదరాబాద్‌పై సీమాంధ్రులు పట్టుబడుతున్న నేపథ్యంలో ఆయన రాష్ట్రంలోని ఇతర నగరాల గురించి ప్రస్తావిస్తారా, వాటిని అభివద్ధి చేయాల్సిన అవసరాలను నొక్కి చెబుతారా అనేది వేచి చూడాల్సిన విషయం.
సీమాంధ్రలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, కర్నూలు, అనంతపురం వంటి నగరాలను అభివృద్ధి చేయాల్సిన తీరుపై తన దృక్పథాన్ని ఎలా అందిస్తారో చూడాల్సి ఉంది. అలాగే తెలంగాణ వరంగల్, కరీంనగర్ వంటి నగరాల గురించి ఏమంటారనేది ఉత్కంఠ కలిగించే విషయమే.
హైదరాబాదులోనూ తెలంగాణలోనూ ముస్లిం మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారి మనోభావాలు దెబ్బ తినకుండా హైదరాబాద్ విషయాన్ని ఎలా ప్రస్తావించారనేది కూడా ఆసక్తికరంగానే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ వివాద పరిష్కారానికి ఆయన ఏదైనా మార్గాన్ని సూచిస్తారా అనేది ఉత్కంఠ కలిగించే విషయంగా మారింది.












Click it and Unblock the Notifications