ఎవరు జెండా ఎత్తేస్తారో, నాడు పటేల్-నేడు మోడీ: కిషన్

ఆదివారం ఎల్బీ నగర్ స్టేడియంలో నవ భారత యువ భేరీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. 2014 లోపు ఎన్ని పార్టీలు ఉంటాయో, ఎన్ని పార్టీలు పోతాయో తెలియదన్నారు.
సభలకు డబ్బులిచ్చి తీసుకు వచ్చుకుంటున్న తరుణంలో మోడీ సభకు అభిమానంతో డబ్బులిచ్చి వచ్చారన్నారు. టిడిపి, కాంగ్రెసు.. ఇలా ఏ పార్టీ మీటింగులలోనైనా ప్రధాన కేంద్రం మోడీ అయ్యారన్నారు. పలువురు రాజకీయ నాయకులు పాదయాత్రలు చేస్తున్నారని, డబ్బులతో సభలకు పిలిపించుకుంటారన్నారని ఆరోపించారు. తమ పార్టీ మాత్రం ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం మోడీ సభ కోసం డబ్బులు వసూలు చేశామన్నారు.
తెలంగాణపై టిడిపికి రెండు నాలుకలు ఉంటే, కాంగ్రెసు పార్టీకి ఎన్ని నాలుకలున్నాయో చెప్పలేమన్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుతున్నారన్నారు. ఎపి రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పచ్చి అబద్దాల కోరు అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ స్ర్కీన్ ప్లే, దర్శకత్వంలో సీమాంధ్రలో ఉద్యమాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
తాము ఏ జెండకు ఆ గొడుకు పట్టమన్నారు. బిజెపి తీసుకునే నిర్ణయం కచ్చితంగా అమలు చేస్తుందన్నారు. సీమాంధ్రలోని తమ పార్టీ కార్యాలయాల పైన, నేతల పైన దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్న సీమాంధ్ర బిజెపి నేతలకు తాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
గుజరాత్‌కు, హైదరాబాద్‌కు అవినాభావ సంబంధం
గుజరాత్‌కు, హైదరాబాద్‌కు అవినాభావ సంబంధముందన్నారు. హైదరాబాదును నిజాం కర్కశంగా పాలించిన రోజుల్లో గుజరాత్ గడ్డ పైన పుట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దీనిని ఇండియన్ యూనియన్‌లో కలిపేందుకు కృషి చేశారన్నారు. అదే గడ్డ పైన పుట్టిన మోడీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చారన్నారు. మోడీ వస్తున్నాడని భయపడి కాంగ్రెసు తెలంగాణను ప్రకటించిందన్నారు. దేశానికి ఎవరు దిశా, నిర్దేశనం చేస్తారా అని చూస్తున్న తరుణంలో మోడీ కనిపిస్తున్నారన్నారు.
2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా 100 బహిరంగ సభలు ఉంటాయన్నారు. గుజరాత్‌లా రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలంటే బిజెపి అధికారంలోకి రావాలన్నారు. ఇతర పార్టీలలా బిజెపి అవకాశవాద పార్టీ కాదని, ఏ ఎండగు ఆ గొడుకు పట్టే పార్టీ కాదన్నారు. మోడీని హైదరాబాదులో కాలు మోపనీయమని కొందరు చెప్పారని, అలా చెప్పేందుకు ఇది నిజాం సొత్తు కాదన్నారు. బిజెపి హైదరాబాదులో ఉన్నన్ని రోజులు ఎవరి ఆశలు నెరవేరవన్నారు.
కాంగ్రెస్ పోవాలి.. బిజెపి రావాలి: వెంకయ్య
దేశంలో ఆర్థిక, ప్రాంతీయ అసమానతలు పెరిగిపోయాయని బిజెపి అగ్రనేత వెంకయ్య నాయుడు అన్నారు. వాజపేయి హయాంనాటి స్వర్ణయుగాన్ని మళ్లీ తీసుకు వస్తామన్నారు. కాంగ్రెసు హయాంలో గాలి, నీరు, భూమి, ఆకాశం అన్నింటిలో అవినీతే అన్నారు. అంతటా కాంగ్రెసు పోవాలి... బిజెపి రావాలనే నినాదం వినిపిస్తోందన్నారు. కాంగ్రెసు పార్టీ చీలికలు, పేలికలుగా మారిందన్నారు. మోడీ నాయకత్వం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోందన్నారు.
దేశానికి చచ్చు నాయకుడు కాదని, గట్టి నాయకుడు కాదన్నారు. మోడీ అంటే త్రీడి, డైనమిక్, డెవలప్‌మెంట్ అన్నారు. అవినీతి, ధరల పెరుగుదల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. ప్రజలు ప్రాంతీయ విద్వేషాలకు లోనుకావొద్దన్నారు. బిజెపి నిజాం వారసత్వం తెచ్చే పార్టీ కాదన్నారు. ఈ హైదరాబాదులో నిజాం కోరలు పీకింది... గుజరాత్ బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేలే అన్నారు. ఇప్పుడు అదే గుజరాత్ బిడ్డ మరోసారి వచ్చారన్నారు.
హైదరాబాదులో అందరికీ రక్షణ ఉంటుందని, అందరికీ అవకాశముంటుందన్నారు. రేపు రాబోయే ఎన్నికల ప్రచార ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఎవరు ఏం చెప్పినా వచ్చే ఎన్నికల్లో బిజెపిదే గెలుపు అన్నారు. ఎపిలోని అన్ని ప్రాంతాల నుండి ఎంపీలను, ఎమ్మెల్యేలను తగిన సంఖ్యలో గెలిపించాలని కోరారు.












Click it and Unblock the Notifications