వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతా బెనర్జీ 72 గంటల డెడ్‌లైన్, తగ్గని జిజెఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mamata Banerjee
కోల్‌‍కతా: డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్లో ఓ భాగమని, అది తన గుండె అని, జాతి ఆధారంగా రాష్ట్రాన్ని విభజించమని, 72 గంటల్లోగా బంద్ ఉపసంహరించుకోవాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ గూర్ఖా జనముక్తి మోర్చా(జిజెఎం)ను శనివారం హెచ్చరించారు.

72 గంటలు సమయమిస్తున్నానని, బంద్ ఉపసంహరించుకోవాలని, బంద్‌లు రాజ్యాంగవిరుద్ధమని సుప్రీం కోర్టు చెప్పిందని, ఆందోళనలు విరమించుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డార్జిలింగ్ పర్వత ప్రాంతంలో సాధారణ పరిస్థితులు తీసుకురావాలని కలకత్తా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో శనివారం రాష్ట్ర సచివాలయంలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఉగ్రరూపం దాల్చారు. ఎనిమిది రోజులుగా సహించానని చెప్పారు.

ఇక కఠిన చర్యలు తీసుకునేలా చేయొద్దని ఆమె హెచ్చరించారు. డార్జిలింగ్‌లో బలవంతంగా బంద్ చేయించడం ద్వారా జిజెఎం ప్రజల్ని ఇబ్బందిపెడుతోందని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రం పైనా ఆమె విమర్శలు గుప్పించారు. విభజన రాజకీయాలకు పాల్పడొద్దని అన్నారు.

మమత విధించిన 72 గంటల గడువుపై జిజెఎం కూడా దీటుగా స్పందించింది. ఈ డెడ్‌లైన్‌ను వెనక్కి తీసుకోకపోతే ప్రజలే స్వచ్ఛంద కర్ఫ్యూ విధిస్తారని జిజెఎం నేత బిమల్ గురుంగ్ హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కొనసాగిస్తామని, అణచివేయాలని చూస్తే తగిన జవాబిస్తామని చెప్పారు.

English summary

 Chief minister Mamata Banerjee took the Gorkha Janmukti Morcha head-on on Saturday, issuing a 72-hour ultimatum to call off the strike or "face strong action". She also hinted the government would investigate the Morcha's sources of money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X