జై తెలంగాణ.. జై సీమాంధ్ర: మోడీ నినాదం(పిక్చర్స్)
హైదరాబాద్: తమకు తెలంగాణ ఎంత ముఖ్యమో... సీమాంధ్ర కూడా అంతే ముఖ్యమని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. నగరంలోని ఎల్బీ నగర్ స్టేడియంలో జరిగిన నవ భారత యువ భేరీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా, తెలంగాణ ప్రజలు సోదరభావంతో మెలగాలని కోరారు. అన్నదమ్ముల్లాంటి మీ మధ్య కాంగ్రెసు పార్టీ చిచ్చు పెట్టిందని ఆరోపించారు.
సీమాంధ్రలో రాజధాని ఏర్పడితే హైదరాబాదు కంటే ఎక్కువ అభివృద్ధి చెందుతుందన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి బిజెపి కృషి చేస్తుందన్నారు. ఆంధ్రా ప్రజలకు అన్యాయం చేసే హక్కు కాంగ్రెసు పార్టీకి లేదన్నారు. గుజరాత్ మాదిరిగా తెలంగాణ, ఆంధ్రాను అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు.
గుజరాత్ రాష్ట్రంలో ఆరు లక్షల మంది తెలుగు ప్రజలున్నారని, వారి పట్ల తమకు ఎంతో ప్రేమాభిమానాలున్నాయన్నారు. తాను మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టిన ప్రాంతాల నుండి వచ్చానన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలంగాణ, ఆంధ్ర ప్రజలు ప్రేమానురాగాలు పంచుకోవాలన్నారు.

ప్రసంగిస్తున్న మోడీ
హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరిగిన నవ భారత యువ భేరీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ

మోడీ, కిషన్, దత్తాత్రేయ...
హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరిగిన నవ భారత యువ భేరీ సభకు హాజరైన గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ, సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయలు అభివాదం చేస్తున్న దృశ్యం. చిత్రంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి

మోడీ అభివాదం
బిజెపి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన నవ భారత యువ భేరీలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. చిత్రంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాగం జనార్ధన్ రెడ్డి, యెండల లక్ష్మీ నారాయణ, బండారు దత్తాత్రేయ తదితరులు.

వృద్ధురాలితో మోడీ
నవ భారత యువ భేరీ సభకు వచ్చిన ఓ ఎనభై అయిదేళ్ల వృద్ధురాలితో మాట్లాడుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ. ఈమె కెనెడాలో ఉన్న తన కుమారుడిని ఒప్పించి మోడీ సభకు హాజరయ్యారు.

స్వతంత్ర సమరయోధుడికి మోడీ ప్రణామం
ఎల్బీ స్టేడియంలో జరిగిన నవ భారత యువ భేరీ సభకు తన కుటుంబ సభ్యులను ఒప్పించి.. వచ్చిన ఓ స్వతంత్ర సమరయోధుడితో మాట్లాడుతున్న నరేంద్ర మోడీ. ఈయన కాళ్లకు మోడీ నమస్కరించారు.

మోడీతో రాష్ట్ర నేతలు
నవ భారత యువ భేరీకి వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీతో రాష్ట్ర నేతలు. ఉత్తరాఖండ్ వరద బాధితులకు పది లక్షల రూపాయల చెక్‌ను అందజేస్తున్న నేతలు.

అందరికీ వందనాలు!
హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరిగిన నవ భారత యువ భేరీకి హాజరైన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ఇతర రాష్ట్ర నేతలు. సభకు హాజరైన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం.
జై తెలంగాణ.. జై సీమాంధ్ర అన్నారు. ఇరు ప్రాంత ప్రజలు కాంగ్రెసు పార్టీ మాయలో పడి ఘర్ణణకు దిగవద్దన్నారు. ఇరు ప్రాంతాలు అన్నదమ్ముల్లా విడిపోయి రెండు రాష్ట్రాలను కలిసి అభివృద్ధి చేసుకోవాలన్నారు. బిజెపికి తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాలు ముఖ్యమన్నారు.
ఆంధ్రకు సముద్ర తీరం ఉందని దీని ద్వారా ఎంతో అభివృద్ధి చెందవచ్చునని అన్నారు. తెలంగాణ ఇస్తామని బిజెపి మొదటి నుండి చెబుతోందని కానీ, కాంగ్రెసు పార్టీ ఓట్లు పోతాయనే భయంతో విభజించిందన్నారు. తెలుగు వారు ఎన్టీఆర్ స్ఫూర్తిగా కాంగ్రెసు ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు.
యువత నైపుణ్యాల మెరుగుకు కాంగ్రెసు ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వృత్తి నైపుణ్యం కల్పించడంలో ఏం చేస్తోందో చెప్పాలన్నారు. ఉన్నత విద్యావంతులు, మేథావులు విదేశాలకు తరలి వెళ్లడం దేశానికి ఎంతో నష్టమన్నారు. దేశమంతా యువత భవిష్యత్తు పైన ఆందోళనతో ఉందన్నారు.












Click it and Unblock the Notifications