మోడీ సభలో కాంగ్రెస్‌కు నాగం వార్నింగ్, దత్తన్న పాట

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసు పార్టీ వెనుకడుగు వేస్తే తెలంగాణ ప్రజలు క్షమించబోరని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి ఆదివారం నవ భారత యువ భేరీ బహిరంగ సభలో హెచ్చరించారు. మోడీ నాయకత్వంలో గుజరాత్ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ సభకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. సభలో బిజెపి సీనియర్ నేత బండారు దతాత్త్రేయ పాట పాడారు.

2014 ఎన్నికలలో 'అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్' నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మాజీ కేంద్రమంత్రి విద్యాసాగర రావు అన్నారు. ఒక ఫోన్‌లో రెండు సిమ్ కార్డుల్లా తెలుగు ప్రజలమంతా కలిసి ఉందామని పిలుపునిచ్చారు. బుల్లెట్ కంటే శక్తివంతమైనది బ్యాలెట్ అని, దాని ద్వారా మోడీ నాయకత్వాన్ని బలపరుద్దామని కోరారు.

రాష్ట్రంలో తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలకు కాంగ్రెసు పార్టీయే కారణమని బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. రాష్ట్రంలో సంక్షోభానికి అధికార పార్టీయే కారణమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నామమాత్రంగా ఉన్నారని, మంత్రులు, ఎంపీలు ఇరు ప్రాంతాలుగా విడిపోయారన్నారు. దేశ భవిష్యత్తును మార్చే డైనమిక్ లీడర్ మోడీ అన్నారు. దత్తాత్రేయ పాడవోయి భారతీయుడా.. అంటూ పాటపాడి వినిపించారు.

ఈ హైదరాబాద్‌కు స్వాతంత్రం ఇచ్చిన నాటి సర్దార్ వల్లభాయ్ పటేల్‌లా... నేడు మోడీని ముందుకు తీసుకు వెళ్తారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు అన్నారు. భారత సైనికులను హతమారుస్తున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మౌనంగా ఉన్నారని ఆరోపించారు.

పల్లెపల్లెలో కమలం జెండా ఎగురవేద్దామని మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. పాక్, చైనా సైన్యం భారత భూభాగంలోకి చొచ్చుకు వస్తున్న కేంద్రం స్పందించడం లేదని బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. కాగా అంతకుముందు నరేంద్ర మోడీని హైదరాబాద్ నగర శాఖ నాయకులు శాలువా కప్పి సన్మానించారు. జ్ఞాపికను అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+