అది ఉన్మాదం: కవిత, కొండా సురేఖపై గండ్ర నో కామెంట్

కొండా సురేఖ వస్తే స్వాగతించను, వ్యతిరేకించను: గండ్ర
మాజీ మంత్రి, వరంగల్ జిల్లా సీనియర్ రాజకీయ నాయకురాలు కొండా సురేఖ కాంగ్రెసు పార్టీలోకి వస్తే తాను స్వాగతించనని అలాగే వ్యతిరేకించనని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి వేరుగా అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ నిన్నటి సభలో అన్నీ అబద్దాలే చెప్పారన్నారు. కాంగ్రెసు పార్టీని విమర్శించడమే మోడీ లక్ష్యమని మండిపడ్డారు.
బిజెపి, టిడిపి కలిస్తే కుంటి, గుడ్డి కలిసినట్లుగా ఉంటుందన్నారు. మోడీ ప్రధాని కావాలని కలలు కంటున్నారని, అవి పగటి కలలే అవుతాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుది రెండు కళ్ల సిద్దాంతమని మరోసారి తేలిపోయిందన్నారు. తమ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత నేతలది ధిక్కారమో కాదో ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చెబుతారన్నారు.
లోపాయకారి ఒప్పందం: కోడెల
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయని టిడిపి సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆరోపించారు. విభజనపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మౌనం సరికాదన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి విభజనను అడ్డుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications