స్టార్ సత్తా చాటింది ఎన్టీఆరే: వారితోను మోడీ అదే మాట

Narendra Modi praises NTR in Cine personalities meet
హైదరాబాద్: నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన నవ భారత యువ భేరీ బహిరంగ సభలో స్వర్గీయ నందమూరి తారక రామారావు పైన ప్రశంసల వర్షం కురిపించిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ.. అంతకుముందు తనను కలిసిన పలువురు సినీ ప్రముఖుల భేటీలోను ఆయన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారట. ప్రజానీకంపై సినీ తారల ప్రభావం ఎంతటి స్థాయిలో ఉంటుందో చూపించింది ఎన్టీఆరేనని వారితో అన్నారు.

సినీ మాధ్యమానికి ప్రజల్లో ఉన్న బలాన్ని ఎన్టీఆరే చూపించారని మోడీ పలువురితో చెప్పారు. అదే సమయంలో సినీ రంగం గురించి అడిగి తెలుసుకున్నారు. గుజరాత్ అభివృద్ధిలో తెలుగు వారి పాత్రను మోడీ వారితో చెప్పారు. అక్కడి అభివృద్ధిని చూసేందుకు రావాల్సిందిగా వారిని ఆహ్వానించారు.

మోడీకి ఆహ్వానాలు

మోడీని కలిసనన అనంతరం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ.. తనకు ఏ రాజకీయ పార్టీతోను సంబంధం లేదని, మోడీని మర్యాద పూర్వకంగా కలిశానని, ఆ సమయంలో రాష్ట్రం గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడానని చెప్పారు. తాను ఆయనను తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి రావాల్సిందిగా ఆహ్వానించానని చెప్పారు.

దక్షిణ భారత చలనచిత్ర నిర్మాత వాణిజ్య మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ ఆధ్వర్యంలో నిర్మాతలు వచ్చే నెలలో చెన్నైలో నిర్వహించి నూరేళ్ల సినిమా వేడుకకు రావాల్సిందిగా మోడీని ఆహ్వానించారు. హీరో, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ తన రెండో కుమార్తె వివాహానికి రావాల్సిందిగా మోడీని ఆహ్వానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+