జైల్లో పెట్టాక మద్దతా?: అంబటి, మమత వైపు జగన్..!

అదే సమయంలో కొత్త ఫ్రంట్‌కు అవకాశాలుంటే పరిశీలిస్తామని చెప్పారు. తద్వారా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ వైపుకు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో మమతా బెనర్జీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు ఫోన్ చేసి ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనిపై పార్టీ చర్చించిందే తప్ప ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం ఆ పార్టీ మమత పిలుపుకు సానుకూలంగా ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది.
కాగా ఆదివారం విలేకరులతో మాట్లాడిన అంబటి రాంబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెసు పార్టీ పైన మండిపడ్డారు. తెలంగాణ అంశానికి బీజం వేసింది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డేనని కాంగ్రెసు నేతలు చెబుతున్నారని, అది సరికాదన్నారు. ప్రజలను మభ్యపెట్టే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని అయితే, స్టేక్ హోల్డర్లందరితో చర్చించాకనే నిర్ణయం తీసుకోవాలని వైయస్ శాసన సభ సాక్షిగా ప్రకటన చేశారని గుర్తు చేశారు.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తమది సమైక్యవాద పార్టీగా ప్రకటన చేశారని కానీ, మేం అలా చెప్పలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మాజీ మంత్రి కొండా సురేఖ విషయమై చెప్పగా అది వేరే సంగతి అని చెప్పారు. తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉందని, జెండా పీకేయలేదన్నారు. చంద్రబాబు తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర చేస్తానని చెబుతున్నారని, ఆయన యాత్ర ప్రారంభించే ముందు అసలు తెలుగు జాతి ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిన్నదో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications