రంగు రంగుల్లో స్వాతంత్ర్య వేడుకలకు రెడీ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: భారతదేశ ప్రజలు 67వ స్వాతంత్ర్య దినోత్వవ వేడుకలను హర్షాతిరేకాల మధ్య జరుపుకోవడానికి సిద్ధపడ్డారు. దేశ స్వాతంత్ర్య వేడకులకు దేశం ముస్తావుతోంది. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇసుకతో సముద్ర తీరంలో సైకత కళాఖండాలను సృష్టించే ఒడిశా కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ జై జవాన్ నినాదంతో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పూరీ సముద్రతీరంలో ఓ కళాఖండాన్ని రూపుదిద్దాడు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవడానికి, ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడానికి పాఠశాలల పిల్లలు సిద్ధమయ్యారు.
https://www.oneindia.com/independenceday-2013/
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశవ్యాప్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా బలగాలను, పోలీసు బలగాలను అప్రమత్తం చేశారు.

మార్చ్ ఫాస్ట్
న్యూఢిల్లీ ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మార్చ్ ఫాస్ట్ చేయడానికి సర్వీసెస్ సిబ్బంది డ్రెస్ రిహార్సల్ చేశారు. ఇది అత్యంత కనువిందుగా ఉంటుంది.

పటిష్టమైన భద్రత
న్యూఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా బలగాలను కంటికి రెప్పలా దేశాన్ని కాపాడడానికి, అవాంఛనీయ సంఘటనలను నిరోధించడానికి సిద్ధపడ్డారు.

తనిఖీలు ముమ్రం
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలను నిరోధించడానికి భద్రతా బలగాలు, పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. గౌహతిలోని ఫ్యాన్సీ బజార్‌లో వాహనాన్ని తనిఖీ చేస్తున్న భద్రతా బలగాలు...

సిఆర్‌పిఎఫ్ మార్చ్ ఫాస్ట్
శ్రీనగర్‌లోని భక్షీ స్టేడియంలో మార్చ్ ఫాస్ట్‌కు డ్రెస్ రిహార్సల్స్ చేస్తున్న కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సిఆర్‌పిఎఫ్). జమ్మూ కాశ్మీర్‌లో సిఆర్‌పిఎఫ్ విధులు అత్యంత కఠినంగా ఉంటాయి.

రైల్వే పోలీసు కూడా..
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా రాంచీ రైల్వే స్టేషన్‌లో స్నిఫర్ డాగ్స్‌తో, మెటల్ డిటెక్టర్స్‌తో లగేజీని తనిఖీ చేస్తున్న రైల్వే పోలీసు బలగాలు (ఆర్‌పిఎఫ్).

ఇండియా గేట్..
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని న్యూఢిల్లీలోని చారిత్రాత్మక ఇండియా గేట్‌ను శుభ్రం చేస్తున్న ఫైర్ ఫైటర్..

సికింద్రాబాద్‌లో పరేడ్ గ్రౌండ్స్
సికింద్రాబాద్‌లో పరేడ్ గ్రౌండ్స్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం డ్రెస్ రిహార్సల్స్ చేస్తున్న జవాన్లు...

సాంస్కృతి కార్యక్రమాలు..
పిల్లలు పాఠశాలల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. గుర్గావ్ పిల్లలు స్వాతంత్ర్య వేడుకల్లో ప్రదర్శన ఇవ్వడానికి ఇలా సిద్ధమయ్యారు.

సుదర్శన్ నాయక్ సైకత శిల్పం
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ జై జవాన్ నివాదంతో సముద్ర తీరంలో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు.

ప్రతి చోటా అప్రమత్తం..
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గౌహతిలోని ఫ్యాన్సీ బజార్‌లో స్నిఫర్ డాగ్స్‌తో తనిఖీలు నిర్వహిస్తున్న భద్రతా బలగాల సిబ్బంది..

కంటికి రెప్పలా..
దేశాన్ని కంటికి రెప్పలా కాపాడడానికి దేశ భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఇండియా గేట్ వద్ద కాపలా కాస్తున్న భద్రతా బలగాల సిబ్బంది.

ఇండియా గేట్ వద్ద ఇలా..
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చారిత్రాత్మక ఇండియా గేట్ వద్ద భద్రతను పెంచారు. భద్రతా బలగాల రక్షణలో ఇండియా గేట్ ఇలా...












Click it and Unblock the Notifications