కంట తడి పెట్టిస్తున్న ఉల్లి, కిలో రూ. 60: పెట్రోల్ చౌక

కాగా, గోవాలో మాత్రం లీటర్ పెట్రోల్ ధర కన్నా ఉల్లిగడ్డల కిలో ధర ఎక్కువగా ఉంది. గోవాలో లీటర్ పెట్రోల్ ధర 58 రూపాయలు పలుకుతుండగా, ఉల్లి ధర కిలోకు 60 నుంచి 70 రూపాయల వరకు పలుకుతోంది. గోవా రాష్ట్ర ఉద్యానవల సంస్థ దుకాణాల్లో కిలో ఉల్లిని 60 రూపాయలకు విక్రయిస్తున్నారు.
పానాజీలో శనివారం 40 నుంచి 45 రూపాయలు ఉన్న ఉల్లిధర ఒక్కసారిగా 65 రూపాయలకు పెరిగింది. కొంత మంది వ్యాపారాలు 70 రూపాయలకు కూడా విక్రయిస్తున్నారు. ఢిల్లీలో ఉల్లి ధర కిలోకు 70 నుంచి 80 రూపాయల వరకు పలుకుతోంది. మదర్ డైరీకి 350 దుకాణాల్లో 52 రూపాయలకు విక్రయిస్తున్నారు.
ఉల్లి సరఫరా సోమంవారం సాధారణ స్థాయికి వచ్చిందని, మంగళవారం కాస్తా ధరలు తగ్గాయని, అజాద్‌పూర్ మండి వ్యాపారుల సంఘం కార్యదర్శి రాజేంద్ర శర్మ పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదులో కిలో ఉల్లి 70 నుంచి 80 రూపాయల దాకా పలుకుతోంది.


Click it and Unblock the Notifications