గాంధీ అడుగుజాడల్లో నడుద్దాం: రాష్ట్రపతి ప్రణబ్ ఉద్బోధ

న్యూఢిల్లీ: సిద్ధాంతాలూ విలువలూ పాటిస్తూ గాంధీజీ అడుగుజాడల్లో నడుద్దామని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. దేశ 67వ స్వాతంత్ర్య దినోత్సవసం సందర్భంగా ఆయన బుధవారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అవినీతి దేశానికి పెద్ద సవాలుగా మారిందని ఆయన అన్నారు. నిజాయితీతో కూడిన ప్రయత్నం, ఉద్దేశ్యంలో నిజాయితీ, సుదీర్ఘమైన మంచికి త్యాగం లేకుండా గాంధీజీ దృక్పథాన్ని వాస్తవం చేయలేమని ఆయన అన్నారు.

https://www.oneindia.com/independenceday-2013/

మన ప్రజాస్వామ్యం ఐదేళ్లకోసారి ఓటు హక్కును వినియోగించుకోవడం కన్నా మించిందని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షల సారమని, నాయకుల బాధ్యతలను ప్రభావితం చేసే స్ఫూర్తి అని, పౌరుల విధులను గుర్తు చేసేదని ఆయన అన్నారు. వైబ్రంట్ పార్లమెంటు ద్వారా, స్వతంత్ర న్యాయవ్యవస్థ ద్వారా, బాధ్యతాయుతమైన మీడియా ద్వారా, అప్రమత్తతతో కూడిన పౌర సమాజం ద్వారా, అధికార యంత్రాంగం సమగ్రత, కఠోర శ్రమ ద్వారా ప్రజాస్వామ్యం శ్వాస తీసుకుంటుందని ఆయన అన్నారు.

pranab mukherjee

విశ్వవిద్యాలయాలు నాలెడ్జీ హబ్‌లుగా మారాలని, పంచాయతీ వ్యవస్థ పటిష్టం కావాలని ఆయన అన్నారు. హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. మరో సువర్ణ యుగాన్ని సృష్టించడానికి ప్రజాస్వామ్యం అవకాశం ఇచ్చిందని, ఈ అసాధారణమైన అవకాశాన్ని వాడుకోవాలని, తెలివితో, ధైర్యంతో, కృత నిశ్చయంతో ఈ ప్రయాణాన్ని కొనసాగించాలని ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు.

మరింత సామాజిక సామరస్యానికి, శాంతికి, సౌభాగ్యానికి చేసే దేశ ప్రయాణంలో ప్రతి ఎన్నిక కూడా కీలకమైన మైలు రాయి అని, ఈ ప్రజాస్వామ్య వేడుకను భద్రతను, ఆర్థికాభివృద్ధిని ఖాయం చేసే స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి అవకాశంగా తీసుకోవాలని ఆయన అన్నారు.

అంతర్గత, బాహ్య భద్రతకు పెను సవాళ్లు ఎదురవుతున్నాయని, కిరాతకమైన మావోయిస్టు హించ చత్తీస్‌గడ్‌లో అమాయకుల ప్రాణాలను బలి తీసుకుందని ఆయన అన్నారు. పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి మనం నిరంతరం ప్రయత్నిస్తున్నప్పటికీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయని, కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరుగుతోందని, ఫలితంగా ప్రాణాలు పోతున్నాయని ఆయన అన్నారు. నగదు బదలీ పథకాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+