నీట్ రద్దు, మీ హిందీ వద్దు- అసెంబ్లీలో కేంద్రానికి తేల్చేసిన విజయ్..!

తమిళనాడులో తొలిసారి అధికారంలోకి వచ్చిన సీఎం విజయ్(Vijay).. ఇవాళ అసెంబ్లీలో దుమ్మురేపే ప్రసంగం చేశారు. ముఖ్యంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై విజయ్ తీవ్ర విమర్శలు చేశారు. నీట్ పరీక్ష నుంచి త్రిభాషా సూత్రం వరకూ తమిళనాడు విధానాన్ని తేల్చిచెప్పేశారు. మరోవైపు తన పార్టీ టీవీకేను కేవలం ఒక నటుడి పార్టీగా ముద్రవేస్తున్న విమర్శకులకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. గత ఎన్నికల్లో టీవీకే సాధించిన విజయాన్ని ఆయన వారికి గుర్తుచేశారు.

కర్నాటకకు వ్యతిరేకంగా అసెంబ్లీని ఏకతాటిపైకి తెచ్చిన విజయ్..!
కర్నాటకకు వ్యతిరేకంగా అసెంబ్లీని ఏకతాటిపైకి తెచ్చిన విజయ్..!

టీవీకే అనేక కుట్రలు, ఆంక్షలను అధిగమించిందని, తాము గానీ లేదా తన పార్టీ గానీ కనుమరుగయ్యే అవకాశం లేదని విజయ్ తేల్చిచెప్పారు. తమకు అధికారం సులభంగా రాలేదని, తమిళ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడానికి తాము పడిన కష్టాలు తమకే తెలుసన్నారు. కొందరు అర్థం కానట్లు నటిస్తూ, అతను కేవలం ఒక నటుడు, ఇది కేవలం ఒక నటుడి పార్టీ అంటున్నారని ఆక్షేపించారు. అలాంటి విమర్శలను పట్టించుకోబోమన్నారు. తమ రాజకీయాలు పారదర్శకంగా ఉంటాయని తెలిపారు.

NEET Is Unfair CM Vijay Defends 2-Language Policy on Assembly Floor
Ys Jagan-Vijay: బ్రదర్ విజయ్..! వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్..!
Ys Jagan-Vijay: బ్రదర్ విజయ్..! వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్..!


నీట్ పరీక్ష కోసం అనుసరిస్తుున్న విధానం అసమానతల్ని సృష్టిస్తుందని విజయ్ ఆరోపించారు. కాబట్టి దీన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. గత కొన్నేళ్లుగా నీట్ అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందని, పరీక్ష ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం నుండి, దేశంలో వైద్య విద్య విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రశ్నపత్రాలు లీక్ కావడం వరకు అనేక సమస్యలు ఇందులో ఉన్నాయని విజయ్ గుర్తుచేశారు. ఈ పరీక్షను రద్దు చేయాలని, 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరగాలని తమిళనాడు పదేపదే కోరుతూ వస్తోందన్నారు. అలాగే దక్షిణ రాష్ట్రంలో హిందీ 'రుద్దడం' అనేది ఒక సున్నితమైన అంశమని, గతంలో ఈ విషయంపై ఇక్కడ హింసాత్మక అల్లర్లు కూడా జరిగాయన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న ద్విభాషా విధానం, అంటే తమిళం (రాష్ట్ర భాషగా), ఆంగ్లం (ప్రపంచ భాషగా) సరిపోతుందని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+