కేంద్రమంత్రి రాజీనామా..! మోడీ కేబినెట్ విస్తరణ వేళ..!
రాజ్యసభ ఎన్నికలు ముగియడంతో కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా పలువురు మంత్రుల్ని సాగనంపబోతున్న ప్రధాని మోడీ, మరికొందరు కొత్త ఎంపీలకు అవకాశాలు కల్పించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్రమంత్రులుగా ఉన్న ఇద్దరు రాజ్యసభ సభ్యులకు తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఇవ్వలేదు. ఇందులో ఒకరైన కేరళ రాజ్యసభ ఎంపీ జార్జి కురియన్ (George Kurian) ఇవాళ తన పదవికి రాజీనామా సమర్పించారు. రాష్ట్రపతి భవన్ వెంటనే దీన్ని ఆమోదించింది.
కేరళకు బీజేపీ నేత అయిన జార్జి కురియన్ 2024లో జరిగిన ఉప ఎన్నికల ద్వారా మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో ఆయనకు మరోసారి అవకాశం కల్పించకూడదని బీజేపీ నిర్ణయించింది. కురియన్ ఇప్పటివరకూ కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖలో సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో క్రైస్తవ వర్గానికి చెందిన ఏకైక మంత్రి కూడా కురియన్ ఒక్కరే. ఆయన రాజ్యసభ పదవీకాలం జూన్ 21తో ముగిసింది. దీంతో ఆయన రాజీనామా చేయక తప్పలేదు.

రాజ్యసభ ఎన్నికల తర్వాత కేంద్ర కేబినెట్ విస్తరణ చేయాలని భావించిన ప్రధాని మోడీ.. కొత్తగా పలువురు నేతల్ని ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించారు. దీంతో కేంద్ర కేబినెట్లో వీరికి చోటు దక్కనుందని తెలుస్తోంది. అలాగే పలువురు కేంద్రమంత్రుల్ని యూపీ, పంజాబ్ వంటి ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఇన్ ఛార్జ్ లుకా కూడా పంపబోతున్నారు. దీంతో భారీ కేబినెట్ విస్తరణ త్వరలో ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రుల రాజీనామాలు ప్రారంభమయ్యాయి. ఇక వరుసగా జార్జి కురియన్ బాటలోనే పలువురు కేంద్రమంత్రులు రాజీనామా చేసే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications