తల్లికి వందనం నిధులు ఆ రోజే, రుషికొండ భవనాలు వారికే - కేబినెట్ కీలక నిర్ణయాలు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దం అయింది. ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం నిధుల జమ తేదీ ఖరారు అయింది. అదే విధంగా సుదీర్ఘంగా జరిగిన తర్జన భర్జనల తరువాత రుషికొండ భవనాల వినియోగం పైనా ఒక నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రంలో కొత్తగా పెట్టు బడులు.. అమరావతిలో నిర్మాణాల పైనా పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. రాజకీయం గానూ మంత్రులతో సీఎం చంద్రబాబు పలు అంశాల పైన చర్చించనున్నారు.
ఏపీ కేబినెట్ ఈ రోజు కీలక సమావేశం జరగనుంది. ఈ రోజు జరిగే సమావేశంలో సంక్షేమ పథకాల అమలు తో పాటుగా అమరావతి, రుషికొండ భవనాల వినియోగం పైనా అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. తల్లికి వందనం నిధుల విడుదలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. జూలై 10న అర్హతలు ఉన్న తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే రోజు న మెగా పేరెంట్స్ టీచర్ల మీటింగ్ కు ముహూర్తంగా నిర్ణయించారు. కాగా.. SIPB లో వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అమరావతిలో నిర్మాణాలు... రాష్ట్రంలో భూముల కేటాయింపు పైనా నిర్ణయం తీసుకోనున్నారు. ఇక.. రెండేళ్లుగా తర్జన భర్జన లు జరిగిన రుషికొండ భవనాల వినియోగం పైనా తుది నిర్ణయానికి కేబినెట్ సిద్దమైంది.

రుషికొండ భవనాలు.. రాజకీయ అంశాల పై చర్చ
రుషికొండ భవనాలను అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్ట్‌గా మారుస్తామని క్యాబినెట్ సబ్ కమిటీ వెల్లడించింది. మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు రిసార్ట్‌గానే కొనసాగించాలని భావిస్తున్నా మని చెప్పింది. దీనిని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో పెద్ద సంస్థలకు ఇస్తామని తెలి పింది. గత వైసీపీ ప్రభుత్వం సుమారు రూ. 450 కోట్లతో నిర్మించిన ఈ భవనాలను మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు పరిశీలన చేసారు. భవనాలను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. రుషికొండ ప్యాలెస్ ను ఆతిథ్య రంగానికే కేటాయించాలని ప్రాథమికంగా కమిటీ అభిప్రాయపడుతోందని చెప్పుకొచ్చారు. విశాఖపట్నం ప్రజల సెంటిమెంట్‌ను కూడా గౌరవిస్తూ ఒక బ్లాక్‌ను కల్చరల్ లేదా హెరిటేజ్ సెంటర్ నిర్వహణకు కేటాయించేందుకు కేబినెట్ సబ్ కమిటీ సిఫారసుల పైన మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అధికారిక అజెండా తరువాత రాష్ట్రంలో ప్రస్తుతం నెలకున్న రాజకీయ పరిణామాల పైనా మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications