కుప్పకూలిన పసిడి రేట్లు

అంతర్జాతీయ మార్కెట్ లో అమెరికన్ డాలర్ ఒక్కసారిగా పుంజుకోవడం, రాబోయే అమెరికా ఉద్యోగ గణాంకాలపై మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో బంగారం, వెండి ధరలు భారీగా క్షీణించాయి. గ్లోబల్ మార్కెట్లతో పాటు దేశీయంగానూ పసిడి విలువలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే పసిడి, వెండి తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. భారీగా నష్టాల బాట పట్టాయి. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్ లో స్పాట్ గోల్డ్ ధర ఏకంగా 1.04 శాతం వరకు క్షీణించి ఔన్స్‌కు 4,158.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో వెండి ధర కూడా గరిష్ఠంగా 3.55 శాతం భారీగా పతనమై ఔన్స్‌కు 63.25 డాలర్ల వద్ద నష్టాల్లో కొనసాగుతోంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తు ద్రవ్య విధానాలపై నెలకొన్న అనిశ్చితి వల్లే మార్కెట్లో ఈ ఒత్తిడి పెరుగుతోందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

MCX Gold Falls Further as 24K at Rs 146520 22K and 18K at Rupee Moves and Strong Dollar Drive

గ్లోబల్ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ కరెన్సీ రూపాయి హెచ్చుతగ్గుల మధ్య ట్రేడవడంతో దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లోనూ బంగారం ధరలు బలహీనపడ్డాయి. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ 10 గ్రాముల బంగారం ధర 0.86 శాతం క్షీణించి రూ. 1,46,841 వద్ద ట్రేడైంది. అలాగే జూలై కాంట్రాక్ట్‌కు సంబంధించిన ఎంసీఎక్స్ వెండి ఫ్యూచర్స్ ధర కూడా భారీగా అంటే 2.81 శాతం క్షీణించి కిలో రూ. 2,27,735 కి పడిపోవడం మదుపర్లను ఆందోళనకు గురిచేసింది.

సాధారణంగా రూపాయి మారకం విలువలో వచ్చే మార్పులు మరియు యూఎస్ డాలర్ ఇండెక్స్ కదలికలు భారత మార్కెట్‌లో బంగారం, వెండి ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం రూపాయి తీవ్ర ఒడిదొడుకుల మధ్య సాగుతుండగా, గ్లోబల్ మార్కెట్‌లలో అమెరికా కరెన్సీ డాలర్ గరిష్ఠాల వద్ద కదలడం జ్యువెలరీ మేకర్లు, వినియోగదారులలో సైతం కొనుగోళ్లు కొంత నెమ్మదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,793, 22 క్యారెట్లు - రూ. 13,560, 18 క్యారెట్లు - రూ. 11,340

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,591, 22 క్యారెట్లు- రూ. 13,375, 18 క్యారెట్లు - రూ. 10,944

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,591, 22 క్యారెట్లు- రూ. 13,375, 18 క్యారెట్లు - రూ. 10,944

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,591, 22 క్యారెట్లు- రూ. 13,375, 18 క్యారెట్లు - రూ. 10,944

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,591, 22 క్యారెట్లు- రూ. 13,375, 18 క్యారెట్లు - రూ. 10,944

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,591, 22 క్యారెట్లు- రూ. 13,375, 18 క్యారెట్లు - రూ. 10,944

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+