తండ్రి చేతుల్లోంచి జారి మూసీ నదిలో పడిన పాప

మూసీ నదిలో గల్లంతైన బాలికను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. గజఈతగాళ్లు పాప కోసం ప్రయత్నాలు సాగించారు. ఆయినా ఫలితం దక్కలేదు. కాగా, ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదంటే తమ పరిధిలోకి రాదని ఉప్పల్, ఎల్బీ నగర్ పోలీసులు సహాయానికి ముందుకు రాలేదని తెలుస్తోంది.
విశాఖపట్నం జిల్లా కొత్తవీధీ మండలం సిగినాపల్లిలో రంగురాళ్ల క్వారీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బండరాళ్లు పడి గిరిజనుడు మృతి చెందాడు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడం వల్లనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అస్వస్థతకు గురైనవారిలో 18 మందిని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications