రైడ్‌లో యువత జోరు : టెక్కీల సైకిల్ సవారి(పిక్చర్స్)
హైదరాబాద్: పేద విద్యార్థుల చదువుల సహాయార్ధం కార్పోరేట్ ఉద్యోగులు సైకిళ్లు తొక్కారు. హైదరాబాదులోని బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో అట్లాంటా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ది ఫ్రీడమ్ రైడ్ 2013 కార్పోరేట్ సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం ఏడు గంటలకు దీనిని ప్రారంభించారు.
ఈ సైకిల్ యాత్రకు భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని ఎపిఐఐసి ఎండి జయేష్ రంజన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధి రమేష్ కాజా, రాష్ట్ర సైక్లింగ్ ఛాంపియన్ రామన్ గరిమెల్లలు ముఖ్య అతిథులుగా వచ్చారు. వీరి జెండా ఊపి సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఇందులో దాదాపు 50 కార్పోరేట్ కార్యాలయాలకు చెందిన ఆరువేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు.
గచ్చిబౌలి నుండి 66 కిలోమీటర్లు, అలాగే రెండు కిలోమీటర్ల విభాగంలో జరిగిన యాత్రలో సాఫ్టువేర్ ఇంజనీర్లు ఉల్లాసంగా పాల్గొన్నారు. నిత్యం బిజీగా గడిపే కార్పోరేట్ కార్యాలయాల ఉద్యోగులు ఈ తరహా సైక్లింగ్ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా సొంతమవుతుందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

ది ఫ్రీడమ్ రైడ్ 1
అట్లాంటా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో జరిగిన ది ఫ్రీడమ్ రైడ్ 2013కు సైకిల్‌తో వచ్చిన ఓ యువతి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సాఫ్టువేర్ ఉద్యోగులు ఆసక్తి కనబర్చారు.

ది ఫ్రీడమ్ రైడ్ 2
అట్లాంటా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో జరిగిన ది ఫ్రీడమ్ రైడ్ 2013కు సైకిల్‌తో వచ్చిన ఓ ఉద్యోగి. ఈ కార్యక్రమంలో దాదాపు యాభై కార్పోరేట్ కంపెనీలకు చెందిన ఆరువేల మంది యవత పాల్గొన్నది.

ది ఫ్రీడమ్ రైడ్ 3
హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో అట్లాంటా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ది ఫ్రీడమ్ రైడ్ 2013 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైకిల్‌తో వచ్చిన యువతీ, యువకులు.

ది ఫ్రీడమ్ రైడ్ 4
అట్లాంటా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో జరిగిన ది ఫ్రీడమ్ రైడ్ 2013కు సైకిల్‌తో వచ్చిన ఓ యువకుడు. ఈ కార్యక్రమానికి సాఫ్టువేర్ ఉద్యోగుల నుండి మంచి స్పందన వచ్చింది.

ది ఫ్రీడమ్ రైడ్ 5
గచ్చిబౌలిలోని ది ఫ్రీడమ్ రైడ్ కార్యక్రమానికి వచ్చిన సాఫ్టువేర్ ఉద్యోగులు, ఇతరులు. జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం.

ది ఫ్రీడమ్ రైడ్ 6
ది ఫ్రీడమ్ రైడ్‌కు వచ్చిన ఓ చిన్నారి సైకిల్ తొక్తుతున్న దృశ్యం. గచ్చిబౌలి నుంచి 66 కిలోమీటర్లు, అలాగే రెండు కిలోమీటర్ల విభాగంలా జరిగిన యాత్రలో ఉద్యోగులు పాల్గొన్నారు.

ది ఫ్రీడమ్ రైడ్ 7
హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో అట్లాంటా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ది ఫ్రీడమ్ రైడ్ 2013 కార్యక్రమంలో పాల్గొన్న యువత. ఈ సైకిల్ రైడ్‌లో పాల్గొన్న వారు ఆనందం వ్యక్తం చేశారు.

ది ఫ్రీడమ్ రైడ్ 8
ది ఫ్రీడమ్ రైడ్ 2013లో చిన్నపాటి సైకిల్‌తో వచ్చిన చిన్నారి. ఈ కార్యక్రమానికి ఎపిఐఐసి ఎండి జయేష్ రంజన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధిలు ముఖ్య అతిథులుగా వచ్చారు.

యువోత్సాహం
ది ఫ్రీడమ్ రైడ్ కార్యక్రమంలో పాల్గొన్న ఓ యువతి. ఈ కార్యక్రమం గచ్చిబౌలి బాలయోగి స్టేడియం నుండి ప్రారంభమై మైక్రోసాఫ్ట్, ఇల్‌రిడ్జ్, కోకాపేట్, గండిపేట, హిమయత్ సాగర్‌ల మీదుగా తిరిగి స్టేడియానికి చేరుకుంది.

ఉత్సాహం
ది ఫ్రీడమ్ రైడ్ కార్యక్రమంలో సాఫ్టువేరు ఉద్యోగ యువత ఉత్సాహంగా పాల్గొన్నది. ఈ కార్యక్రమంలో పలు సాఫ్టువేర్ సంస్థలకు చెందిన ఉద్యోగులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications