తెలంగాణ గురించి ఏం చెప్పను, నా ఇల్లు: హీరో శ్రీహరి

మరింత సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావడమే సరైనది అనుకుంటున్నానని చెప్పారు. భవిష్యత్‌లో తన పాత్ర ఎలా ఉండబోతోందని చెప్పే జ్ఞానం లేదన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఇంకా చేరలేదని కాబట్టి రాజీనామా ప్రశ్న తలెత్తదన్నారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతోనే తాను జగన్‌ను కలిశానని చెప్పారు. సేవ చేయడమే ముఖ్యమని, కాంగ్రెస్ పార్టీ ద్వారా తాను చేయగలనని అనుకుంటున్నానన్నారు. తొలుత తాను పార్టీకి సేవ చేస్తానని, ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడి నుంచే పోటీ చేస్తానని తెలిపారు. అయితే తనకు కూకట్‌పల్లి అంటే మక్కువ అని మనసులో మాట బయటపెట్టారు.
కాగా, శ్రీహరి తొలుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం కోసం చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అయితే ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెసు నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.












Click it and Unblock the Notifications