జగన్ పార్టీ నేతలే దాడి చేశారు: విహెచ్, జానా గుర్రు

తెలంగాణలోని సీమాంధ్ర ప్రజలు భయపడవద్దని, ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో రెచ్చగొట్టే విధంగా ఎవరు కూడా వ్యవహరించవద్దని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తనకు గులాబీ పూలు ఇస్తుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వెనక నుంచి దాడి చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం ఇప్పటిది కాదని, 60 ఏళ్లుగా కొనసాగుతోందని ఆయన అన్నారు.
కాగా, విహెచ్‌పై దాడి పట్ల తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాలోచిత, అహంకార చర్యగా ఈ దాడి కనిపిస్తోందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఐక్యతను, సమైక్యాన్ని కోరుకునేవారు దాని అవసరాన్ని తెలియజెప్పే విధంగా వ్యవహరించాలని, బాధను వ్యక్తం చేసే విధంగా ప్రవర్తించాలని ఆయన అననారు. అవగాహనలేని వారిని రెచ్చగొట్టే ఈ విధమైన చర్యలు సరైనవి కావని ఆయన అన్నారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాజకీయ పార్టీల నాయకులు, ఇతరులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. దీనిపై ఎక్కువ మాట్లాడడం సరి కాదని, ఇటువంటి చర్యలను మొగ్గలోనే తుంచేయడం మంచిదని ఆయన అన్నారు. పరస్పరం దాడులు చేసుకునే సంస్కృతిని విడనాడాలని ఆయన అన్నారు. సమస్యను సామరస్యపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
ఆ విధంగా అడ్డుకోవాలంటే ఎక్కువ మంది ఎక్కడున్నారో ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. అరాచక సంఘటనలు జరగకుండా పోలీసులు కనిపెట్టాలని ఆయన అన్నారు. కొంత మంది ఆవేశం అనేక మందిని కలవరపెట్టే పరిస్థితి ఉందని, ఇటువంటి చర్యలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications