రేప్ చేయబోయాడు: కేకలతో పైనుంచి దూకేశాడు

అతను కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆ కారు డ్రైవర్‌ను ఆస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం... ఉప్పల్ పట్టణంలో నివసిస్తున్న కుమార్ (38) కారు డ్రైవర్. అతడు గురువారం రాత్రి సరస్వతికాలనీలోని శ్రీ కృష్ణా మెటర్నిటీ నర్సింగ్ హోంలోకి చొరబడ్డాడు.
గదిలో ఉన్న ఓ నర్సుపైఅసభ్యకరంగా వ్యవహరించి అత్యాచార యత్నం చేశాడు. ఇతని చేష్టలకు కంగారుపడిన మరో మహిళ అరిచి కేకలు వేయడంతో రోగుల వద్ద ఉన్నవారు వస్తుండటంతో భయపడిన అతడు తప్పించుకోవడానికి మూడో అంతస్థుపై నుంచి నుండి కిందికి దూకాడు.
తీవ్రంగా గాయపడిన అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ పి.లక్ష్మికాంతరెడ్డి తెలిపారు. ఈ సంగటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications