చిరంజీవి రాజకీయాలకి పనికిరారు, షాకై ఉంటారు: రోజా

రాజకీయాల్లో ఉంటూ సినిమాలు, టివి షోలు చేయడం పెద్ద సమస్య కాదన్నారు. చిరంజీవి అందరితోను బాగుండేవారని, తనను తన కుటుంబంలో ఓ సభ్యురాలిగా చూసేవారన్నారు. రాజకీయాలకు వచ్చేసరికి ఫైట్ చేయక తప్పదన్నారు. ఓ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం పని చేయాల్సి ఉంటుందని, దానికోసం ఎంత దూరమైన వెళతామని అన్నారు. ఆ విషయంలో చిరంజీవి షాక్ అయి ఉంటారని అభిప్రాయపడ్డారు.
అప్పుడప్పుడు ఏదైనా వేడుకల్లో ఎదురయినప్పుడు తనను చూడగానే మొహం అదోలా పెట్టుకుంటారని, మాట్లాడకుండా సీరియస్‌గా కూర్చుంటారని, తాను కూడా అలాగే ఉంటానని చెప్పారు. ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకుంటేనే రాజకీయాల్లో ఇమడగలమన్నారు. చిరంజీవిలాంటి సున్నిత మనస్కుడు రాజకీయాలకు పనికి రారన్నారు.
రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు తప్పవన్నారు. తాను రాజకీయాల్లోకి తెలియకుండానే వచ్చానని చెప్పారు. తాను జీవితంలో అనుకున్నది ఏదీ జరగలేదన్నారు. అన్ని అనుకోకుండా జరిగినవేనని చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసిన ఇరవై నిమిషాలు తన జీవితానికి చాలా విలువైనవని, వైయస్ ఓర్పు, రాజసాలు తనకు తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలో కనిపించాయన్నారు. తాను టిడిపి నుండి బయటకు వస్తానని తాను అనుకోలేదని కానీ, అలాంటిది తనకు తీవ్ర అన్యాయం చేశారన్నారు.












Click it and Unblock the Notifications