చెల్లెలిపై మృగత్వం, హత్య: మనవరాలికి లైంగిక వేధింపు

Brother held for assaulting, killing sister
చెన్నై/ముంబై: తోడబుట్టిన చెల్లెలి పైనే అత్యాచారానికి పాల్పడి, హతమార్చిన సంఘటన తమిళనాడులో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన యువకుడు చెల్లి అని చూడకుండా కోవైలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం ఆమెను ఉరికి వేలాడదీసి ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోవైకి చెందిన ఇరవై అయిదేళ్ల రవి డ్రైవరుగా పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం తన చెల్లెలు(20) ఆత్మహత్య చేసుకుందని పొరుగువారితో చెప్పాడు. అతడి తీరుపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

యువతి మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతిపై అత్యాచారం జరిగిందని, ఆ తర్వాత హత్యకు గురైందని ఆదివారం వెల్లడైంది. పోలీసులు రవిని అరెస్టు చేసి విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. కేసు దర్యాఫ్తు జరుగుతోంది.

మునిమనవరాలికి వేధింపులు

65 ఏళ్ల వయస్సులో ఉన్న ఓ వృద్ధుడు నాలుగేళ్ల వయసులో ఉన్న తన ముని మనవరాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు వృద్ధుడిని అరెస్టు చేశారు. సాక్ష్యాలు చెరిపేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై బాధితురాలి అమ్మమ్మ, నిందితుడి కుమార్ెతను కూడా అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+