వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సవతి తండ్రి సెక్స్ కోరిక తీర్చాలన్నాడు: నటి శిరీష

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లైంగిక కోరిక తీర్చాలని తన సవతి తండ్రి తనను వేధిస్తూ వచ్చాడని, దాంతోనే తాను ఇంటి నుంచి పారిపోయానని తెలుగు నటి సాయి శిరీష ఆరోపించింది. ఈ మేరకు ఆమె ఓ తెలుగు టీవి చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. రోజుల తరబడిగా కనిపించకుండా పోయిన ఆమె సోమవారం రాత్రి ఓ టీవీ చానెల్‌తో మాట్లాడింది. లవ్ అటాక్ అనే చిత్రంలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే.

తన కోరిక తీర్చకపోతే తీవ్ర పరిణామాలుంటాయని సవతి తండ్రి నీలా ప్రసాద రావు తనను హెచ్చరించాడని ఆమె చెప్పింది. తన తల్లి ఇంట్లో లేని సమయాలు చూసి తన లైంగిక కోరిక తీర్చాలని సవతి తంర్డి ఒత్తిడి పెడుతూ వచ్చాడని ఆయన అన్నాడు.తన తల్లి ఆర్థికంగా ఆయనపై ఆధారపడి బతుకుతోందని, అందువల్ల తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని సాయి శిరీష చెప్పింది.

Actor alleges stepfather made sexual advances

లవ్ అటాక్ చిత్రంలో నటిస్తున్న సాయి శిరీష మే 27వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ప్రసాదరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సవతి తండ్రి విషయమై తాను లేఖ రాసి ఇంట్లో పెట్టి పారిపోయానని ఆమె చెప్పింది. అయితే, ఆమె ఎక్కడుందనే విషయాన్ని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు.

టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను పరిశీలించి ఆమె ఎక్కడుందనే విషయాన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తామని పోలీసులు అంటున్నారు. సాయి శిరీష్ కోరితే తాము సవతి తండ్రిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని చెప్పారు. అదృశ్యమైన తర్వాత కూడా ఆమె తల్లితో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు. తల్లితో మాట్లాడడం మానేసిన తర్వాతనే ప్రసాదరావు ఆదివారంనాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
Days after she went missing Telugu actress Sai Sirisha has alleged that she ran away from her home because her step-father used to make sexual advances at her. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X