ఆమరణ దీక్ష: విజయమ్మ హావభావాలు(పిక్చర్స్)
గుంటూరు/విశాఖ/హైదరాబాద్: విభజన తీరును నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. గుంటూరు బస్టాండు ఎదురుగా సోమవారం ఆమె దీక్షను ప్రారంభించారు.
ఇరు ప్రాంతాలకు సమన్యా చేయకుంటే విభజన చేయవద్దని విజయమ్మ దీక్ష చేస్తున్నారు. విజయమ్మ దీక్షకు సంఘీభావంగా సీమాంధ్రలోని పలు జిల్లాల్లో పలువురు రిలే నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలు చేస్తున్నారు. విజయమ్మ దీక్షకు ఈ రోజు కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్ర రావు తదితరులు సంఘీభావం తెలిపారు.
మరోవైపు, తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో సమైక్యాంధ్రకు మద్దతుగా అఖిల పక్షం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు వచ్చారు. సభ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
విజయవాడలో జాతీయ రహదారులు సమైక్యవాదులు దిగ్బంధించారు. విజయవాడ - హైదరాబాద్, కోల్‌కతా - చెన్నై, విజయవాడ - మచిలీపట్నం రహదారులను దిగ్బంధించారు. నిరసనలో ఓ యువకుడు రాహుల్ గాంధీలా మాట్లాడి ఆకట్టుకున్నారు. తనకు పెళ్లి వద్దని, ప్రధాని పదవే లక్ష్యమని మాట్లాడారు.
విద్యుత్ సౌధలో మళ్లీ ఉద్రిక్తత
హైదరాబాదులోని విద్యుత్ సౌధలో మంగళవారం మరోసారి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులను పోలీసులు లోనికి అనుమతించలేదు. వారు ఆందోళనకు దిగడంతో పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేశారు. తాము రక్షాబందన్ జరుపుకునేందుకు వస్తే లోనికి అనుమతించడం లేదని ఆరోపించారు.

దీక్షా ప్రాంగణానికి విజయమ్మ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజమయ్మ సోమవారం ఆమరణ దీక్ష కోసం గుంటూరులోని దీక్షా ప్రాంగణానికి చేరుకున్న దృశ్యం.

మాట్లాడుతున్న విజయమ్మ
అమరణ దీక్షకు పూనుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజమయ్మ దీక్షా ప్రాంగణంలో మాట్లాడుతున్న దృశ్యం.

వైయస్‌కు నివాళి
గుంటూరు దీక్షా ప్రాంగణంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజమయ్మ.

భారీ స్పందన
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజమయ్మ ఆమరణ దీక్షకు భారీగా తరలి వచ్చిన సమైక్యవాదులు, పార్టీ అభిమానులు.

దీక్షా ప్రాంగణంలో...
అమరణ దీక్షకు పూనుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజమయ్మ దీక్షా ప్రాంగణంలో మాట్లాడుతున్న దృశ్యం.

హావభావాలు 1
గుంటూరులో ఆమరణ దీక్షకు దిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ హావభావాలు

హావభావాలు 2
గుంటూరు బస్టాండు సమీపంలో ఆమరణ దీక్షకు దిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ హావభావాలు

హావభావాలు 3
గుంటూరులో ఆమరణ దీక్షకు దిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ హావభావాలు, పక్కన పార్టీ నేతలు.

రెండో రోజు దీక్ష
విభజన తీరును నిరసిస్తూ గుంటూరులో ఆమరణ దీక్షకు దిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ దీక్ష రెండో రోజు కొనసాగుతోంది.

రెండో రోజు దీక్ష
రెండో రోజు దీక్ష కొనసాగిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ తన ఒళ్లోకి ఓ చిన్నారని తీసుకొని ఆడిస్తున్న దృశ్యం.












Click it and Unblock the Notifications