వీరప్పకు రాములమ్మ షేక్‌హ్యాండ్, సీ'మైక్యం'(పిక్చర్స్)

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి నుండి సస్పెన్షన్‌కు గురైన మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి మంగళవారం కేంద్రమంత్రి వీరప్ప మొయిలీని కలిశారు. సస్పెన్షన్‌కు గురైన మరో నేత రఘునందన రావుతో పాటు సీనియర్ నేతలైన విజయ రామారావు, ఎ.చంద్రశేఖర్‌లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెసు పార్టీలో చేరారు.

దిగ్విజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు తెరాస నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపారు. అనంతరం దిగ్విజయ్‌సింగ్ నివాసానికి వెళ్ళి చర్చలు జరిపిన తర్వాత పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటన చేసిందని, తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, అందుకే తాము కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వారు తెలిపారు.

మరోవైపు ఆంటోని కమిటీని సీమాంధ్ర నేతలు మంగళవారం రాత్రి కలుసుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, లేదంటే అన్ని ప్రాంతాలకు నష్టం జరుగుతుందని వారు కమిటీకి చెప్పారు. కాగా, విభజన అనివార్యమైతే రాయల తెలంగాణ కోసంమాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి గ్రూపు మరో వాదన వినిపించినట్లుగా సమాచారం.

మొయిలీకి రాములమ్మ షేక్ హ్యాండ్

మొయిలీకి రాములమ్మ షేక్ హ్యాండ్

కేంద్రమంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీని కలిసి చేయి కలుపుతున్న మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి. ఆమె త్వరలో కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు.

రాములమ్మ, మొయిలీ భేటీ

రాములమ్మ, మొయిలీ భేటీ

కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో విజయశాంతి కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధమై.. ఇటీవల పలువురు నేతలను కలుస్తున్నారు. మొయిలీతో రాములమ్మ భేటీ దృశ్యం.

బయటకు వస్తున్న నేతలు

బయటకు వస్తున్న నేతలు

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు మంగళవారం రాత్రి ఆంటోని కమిటీని కలిశారు. కమిటీని కలిసిన అనంతరం వారు జై సమైక్యాంధ్ర అంటూ బయటకు వస్తున్న దృశ్యం.

అంతా చెప్పాం

అంతా చెప్పాం

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, మరో ప్రత్యామ్నాయం లేదని తాము ఆంటోని కమిటికీ చెప్పామని విలేకరుల సమావేశంలో చెబుతున్న మంత్రి శైలజానాథ్, ఇతర నేతలు.

కాంగ్రెసులోకి తెరాస నేతలు

కాంగ్రెసులోకి తెరాస నేతలు

తెరాసకు చెందిన పలువురు నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఎపి కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కాంగ్రెసు పార్టీలో చేరిన దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+