జగన్ కేసు: ఇంటివద్ద సబితను గంట ప్రశ్నించిన సిబిఐ

పెన్నా సిమెంట్ కంపెనీకి గనుల కేటాయింపు వ్యవహారంలో సబితాను సిబిఐ ప్రశ్నించింది. దిల్‌కుషాలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావును ప్రశ్నించిన సమయంలోనే సబితాను ఆమె నివాసంలో దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబిత.. పలు గనుల లీజులను పెన్నాకు కేటాయించారు.
వైయస్ కుటుంబానికి ఆత్మీయుడైన పెన్నా ప్రతాప రెడ్డి ఇందుకు ప్రతిఫలంగా జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టారని కోర్టుకు సిబిఐ తెలిపింది. జగన్ అక్రమాస్తుల కేసులో చార్జిషీటు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో సబితను ప్రశ్నించి సిబిఐ అధికారులు తమ అనుమానాలను నివృత్తి చేసుకొన్నారు.
హైదరాబాదులోని శ్రీగర్ కాలనీలోని సబిత ఇంటి వద్ద ఆమెను సిబిఐ డిఐజి వెంకటేష్ ఆధ్వర్యంలో గంటపాటు ప్రశ్నించారని సమాచారం. కాగా, జగన్ కేసులో ధర్మానను సిబిఐ కార్యాలయంలో బుధవారం ఐదు గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ధర్మానను లేపాక్షి నాలెడ్జ్ భూములకు సంబంధించి అంశంలో ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications