చిత్రాలు: పర్యావరణం, మట్టి గణేషులు వస్తున్నారు

హైదరాబాద్: వినాయక చవితి యేటా హైదరాబాద్‌లో ధూమ్‌ధామ్‌గా జరుగుతుంది. పోటీ పడి వినాయక విగ్రహాలను గల్లీగల్లీలో నెలకొల్పడం సంప్రదాయంగా వస్తోంది. ఊరేగింపుగా తీసుకుని వెళ్లి హుస్సేన్ సాగర్ వంటి జలాశయాల్లో వాటిని నిమజ్జం చేస్తుంటారు. ఇనుము, తదితర లోహాలతో చేసిన విగ్రహాల వల్ల జలశయాలు కూరుకుపోతున్నాయి.

దీంతో గత కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణపై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫలితంగా పర్యావరణ చైతన్యం ప్రజల్లో గణనీయంగా పెరుగుతోంది. గణేషుడి మట్టి విగ్రహాలకు గిరాకీ పెరుగుతోంది. ఈ ఏడాది పెద్ద యెత్తున మట్టి గణేషుడి విగ్రహాలు రూపు దిద్దుకుంటున్నాయి. రసాయనాలు, లోహ పదార్థాలు లేకుండా గడ్డి, బురద మట్టితో ఈ విగ్రహాలను తయారు చేస్తారు.

హైదరాబాదులోని బాలానగర్‌లో వివిధ భంగిమల్లో, రూపాల్లో వినాయకుడి విగ్రహాలను తయారు చేయడంలో కళాకారులు నిమగ్నమై ఉన్నారు. ప్రకృతితో సహజీవనం చేస్తూ ముందుకు సాగితేనే మానవ మనుగడకు సార్థకత ఉంటుందని, ప్రకృతికి విరుద్ధమైన పనుల వల్ల మానవ జీవితం కష్టాల్లో పడుతుందని గుర్తిస్తున్నారు. అందుకు ఉదాహరణే పెద్ద యెత్తున తయారవుతున్న మట్టి వినాయకులు....

బాలానగర్ కేంద్రంగా..

బాలానగర్ కేంద్రంగా..

హైదరాబాదులోని బాలానగర్‌లో వినాయక విగ్రహాలు పెద్ద యెత్తున తయారవుతున్నాయి. వినాయక చవితి పండుగ దగ్గర పడుతుండడంతో విగ్రహాల తయారీ ఊపందుకుంది. కొంత మేరకు తయారైన ఈ కళాకృతిని మీరు చూడవచ్చు.

సాంస్కృతిక ఐక్యతకు..

సాంస్కృతిక ఐక్యతకు..

సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా గణేష విగ్రహాల నిమజ్జన కార్యక్రమం పెద్ద యెత్తున జరుగుతోంది. పైగా, వాడవాడలా మంటపాలు వెలుస్తున్నాయి. పర్యావరణ చైతన్యం కారణంగా మట్టి గణేషుడి విగ్రహాలకు ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారు.

సింథటిక్ కలర్స్ ప్రమాదకరం

సింథటిక్ కలర్స్ ప్రమాదకరం

వినాయక విగ్రహాల తయారీకి ఇప్పటి వరకు వాడుతూ వస్తున్న సింథటిక్ కలర్స్ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. దీంతో వాటికి ప్రాధాన్యం తగ్గి మట్టి విగ్రహాలు ఇలా రూపుదిద్దుకుంటున్నాయి.

గడ్డి, బంక మట్టి

గడ్డి, బంక మట్టి

పర్యావరణ అనుకూల విగ్రహాల తయారీకి గడ్డిని, బంక మట్టిని వాడుతారు. అవి ఎలా రూపుదిద్దుకుంటాయో ఈ చిత్రంలో చూడవచ్చు. మన కళాకారులు ఈ విగ్రహాలను తయారు చేయడంలో ఆరితేరారు.

బాలానగర్‌లోనే కాదు..

బాలానగర్‌లోనే కాదు..

కొలువు తీరడానికి ఈ వినాయకుడు సిద్ధంగా ఉన్నాడు. బాలానగర్‌లోనే కాకుండా హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఈ మట్టి వినాయకులు రూపుదిద్దుకుంటున్నారు.

సహజసిద్దమైన రంగులతో...

సహజసిద్దమైన రంగులతో...

పర్యావరణ అనుకూల గణేషుడి విగ్రహాలకు ప్రకృతిసిద్ధమైన రంగులను, బంకమట్టిని వాడుతారు. దానివల్ల పర్యావరణానికి ఏ విధమైన విఘాతం కలుగదు. గత కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రచారంతో ఈ విగ్రహాలకు ప్రాచుర్యం పెరిగింది.

ఉచితంగా విగ్రహాల పంపిణీ

ఉచితంగా విగ్రహాల పంపిణీ

కొన్ని సేవా సంస్థలు పర్యావరణ చైతన్యాన్ని పెంచే ఉద్దేశంతో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. దుకాణాల్లో కూడా వీటిని విక్రయిస్తున్నారు. ఇవి పది రూపాయల నుంచి 200 రూపాయల వరకు పలుకుతున్నాయి.

హెచ్ఎండిఎ విక్రయం..

హెచ్ఎండిఎ విక్రయం..

ఎంపిక చేసిన ప్రదేశాల్లో మట్టి వినాయకులను విక్రయించడానికి హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (హెచ్ఎండిఎ) స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. 25 వేల విగ్రహాలను విక్రయించాలనేది హెచ్‌ఎండిఎ లక్ష్యం.

వివిధ సైజుల్లో...

వివిధ సైజుల్లో...

వివిధ సైజుల్లో, ఆకారాల్లో వినాయకుడి విగ్రహాలు రూపుదిద్దుకున్నాయి. ఐదడుగుల ఎత్తు ఉండే విగ్రహాలను రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్‌కు, పాఠశాలలకు, కాలేజీలకు, కమ్యూనిటీ గ్రూపులకు విక్రయిస్తారు.

పది అడుగుల ఎత్తు వరకు..

పది అడుగుల ఎత్తు వరకు..

గణేషుడి విగ్రహాలను పది అడుగుల ఎత్తువరకు తయారు చేయడానికి బాలానగర్ కళాకారులు సిద్ధపడ్డారు. ఈ ఏడాది మట్టి విగ్రహాలకు మంచి గిరాకీ ఉంటుందని వారు ఆశిస్తున్నారు.

గడ్డితో ఇలా పోత..

గడ్డితో ఇలా పోత..

మట్టి విగ్రహాల తయారీకి ముందు ఇలా గడ్డితో రూపం కడుతారు. బంకమట్టి ద్వారా దాన్ని కళాఖండంగా రూపుదిద్దుతారు. ఇందులో ఎంతో శ్రమ ఉంటుంది. కళానైపుణ్యం అంతకు మించి ఉంటుంది.

ఇలా విగ్రహాలు కొలువు..

ఇలా విగ్రహాలు కొలువు..

ప్రజల ముందుకు వెళ్లడానికి ఈ విగ్రహాలు తయారుగా ఉన్నాయి. కళాకారులు విగ్రహాలను తయారు చేసిన తర్వాత ఒక్కటికి రెండు సార్లు తరిచి చూసుకుంటారు.

హుస్సేన్ సాగర్ జలాశయం

హుస్సేన్ సాగర్ జలాశయం

ప్రధాన గణేష నిమజ్జనం హైదరాబాదులో హుస్సేన్ సాగర్ జలాశయంలో జరుగుతుంది. ఆ జలాశయం నుంచి నిమజ్జనం తర్వాత ఇనుపచువ్వలను తీసేయడం ఏటా పెద్ద సమస్యగా మారింది. మట్టి విగ్రహాల వల్ల ఆ శ్రమ తప్పడమే కాకుండా జలాశయం కలుషితం కాకుండా చూసుకోవచ్చు.

రాత్రింబవళ్లు తీరిక లేకుండా..

రాత్రింబవళ్లు తీరిక లేకుండా..

గణేషుడి మట్టి విగ్రహాలను తయారు చేయడంలో కళాకారులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అక్కడే విశ్రాంతి తీసుకుంటూ వాటి తయారీలో మునిగిపోయారు..

గణేషుడికి ఎన్ని రూపాలో...

గణేషుడికి ఎన్ని రూపాలో...

రకరకాల రూపాల్లో, అవతారాల్లో వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించడం హైదరాబాదులో పరిపాటి. అందుకు అనుగుణంగానే కళాకారులు తమ శ్రమను, నైపుణ్యాన్ని ఉపయోగించి విగ్రహాలు తయారు చేస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+