టి: జగన్, వైఎస్ వ్యాఖ్యల సిడిల్ని విడుదల చేసిన టిడిపి

తెలంగాణకు తాము సానుకూలమని వైయస్, విజయమ్మ, జగన్‌లు గతంలో పలుమార్లు చెప్పారన్నారు. తెలంగాణకు మద్దతుగా వైయస్ అధిష్టానం వద్దకు పంపిన వారిలో తాను కూడా ఉన్నట్లు మాజీ మంత్రి కొండా సురేఖ చెప్పారని ఆయన గుర్తు చేశారు. గతంలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీమాంధ్రలో ఏఐసిసి అధ్యక్షురాలు, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ముసుగు వైయస్ జగన్ అని ఎద్దేవా చేశారు. జగన్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో గల్లంతయిందన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కోసం తెలుగు ప్రజలను బలి చేస్తున్నారని మండిపడ్డారు.
విచ్ఛిన్న కారకులు వారే: యనమల
రాష్ట్ర విచ్ఛిన్నానికి వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలో కారణమని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వేరుగా అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకుంటే పార్టీ నుండి బయటకు వస్తామని చెప్పే ధైర్యం కాంగ్రెసు నేతలకు ఉందా అని ప్రశ్నించారు. జగన్‌కు బెయిల్ కోసం, కేసుల మాఫీ కోసం ఢిల్లీ నేతలతో లాలూచీ తప్ప వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు.












Click it and Unblock the Notifications