క్యాన్సర్‌తో సినీ జర్నలిస్టు బాబూరావు మృతి

Journalist babu Rao dead
హైదరాబాద్: సీనియర్ సినీ జర్నలిస్టు లగడపాటి బాబూరాువ బుధవారం మరణించారు. ఆయన వయస్సు 47 ఏళ్లు. ఆయన కొంత కాలంగా ఎముకల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. దాంతో ఆయన ఇంట్లోనే ఉంటూ వస్తున్నారు. ఆయనయ వివాహం చేసుకోలేదు.

ఆయన హైదరాబాదులోని యూసుఫ్‌గుడాలో శ్రీదుర్గా రెసిడెన్సీ ఆపార్టుమెంట్స్‌లో తల్లి లక్ష్మీతులసమ్మతో కలిసి ఉంటున్నారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లాలోని నందిగామ మండలం దాములూరు గ్రామం.

బాబూరావుకు సినీ పరిశ్రమపై ఆమితమైన ఆసక్తి. దాంతో సినిమా రంగంపై వచ్చిన అన్ని పత్రికల్లో ఆయన జర్నలిస్టుగా పనిచేశారు. 1986 -87 నుంచి ఆయన జర్నలిస్టుగా పనిచేస్తూ వస్తున్నారు. సొంతంగా చిత్రం అనే వారపత్రికను నడిపారు.

ఉదయం దినపత్రిక సంస్థ నుంచి వెలువడిన శివరంజని సినిమా పత్రికలో కూడా ఆయన పనిచేశారు. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు. సినిమా జర్నలిస్టులు ఆయనకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+