భవనం కూలి ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు

Three dead as building collapse at Rajahmundry
రాజమండి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మెయిన్ రోడ్డు సమీపంలోని వంకాయలవారి వీధిలో బుధవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో పురాతన భవనం కుప్పకూలిపోయంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు, ఫైర్ సిబ్బంది శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రి తరలించారు. ఆకుల ఆంజనేయులుకు చెందిన ఈ భవనం పక్కన ఖాళీ స్థలంలో కొత్తగా భవనం నిర్మంచడానికి రెండు రోజుల క్రితం పొక్లెయిన్ సహాయంతో పునాదులు తవ్వారు. దీనివల్లనే భవన కూలిందని భావిస్తున్నారు.

ఇంటి యజమాని ఆకుల ఆంజనేయులు, ఆయన భార్య వెంకటలక్ష్మిలను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో ఆంజనేయులు, కుమారుడు జశ్వంత్ మృతిచెందాడు. సంఘటనా స్థలానికి రాజమండ్రి అర్బన్ ఎస్పీ రవికుమార్ మూర్తి, ఫైర్ ఆఫీసర్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటన తెలిసి నగరానికి చెందిన వందలాది మంది ఇక్కడ చేరుకున్నారు.

ఇద్దరు అక్కడికక్కడ మరణించగా, ఓ బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. కూలిన భవనం మూడంతస్థులతో కూడి పాతపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+