ఉద్యమం చిత్రాలు: ఎన్టీఆర్ వేషధారి, సమైక్యాంధ్ర కత్తి
హైదరాబాద్ : సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్రలో శుక్రవారం కూడా కొనసాగింది. వివిధ పద్ధతుల్లో రాష్ట విభజనకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనకారులు తమకు వచ్చిన విద్యలను ప్రదర్శిస్తున్నారు.
రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ గత ఐదు రోజులుగా దీక్ష చేపట్టిన అనంతపురం జిల్లా శాసనసభ్యుడు పల్లె రఘునాథరెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో దీక్షను శుక్రవారం పోలీసులు భగ్నం చేసి, అస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో శాసనసభ్యడి అనుచరులు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగి, తోపులాటకు దారితీసింది. ఎమ్మెల్యే దీక్ష కొనసాగిస్తే ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని పోలీసులు చెప్పి, ఆస్పత్రికి తరటించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే ఎమ్మెల్యే రఘునాథరెడ్డి బార్య దీక్షలో కూర్చున్నారు.
విజయవాడ నగరంలో సమైక్యాంధ్ర ఉద్యమం దూసుకుపోతోంది. సీమాంధ్ర విద్యార్థి జెఎసి నేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విద్యార్థులు కదం తొక్కారు. శుక్రవారం ఉదయం ఎక్జిక్యూటివ్ సర్కిల్ నుంచి బెంజ్‌సర్కిల్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.

ఎన్టీఆర్ వేషధారి..
సమైక్యాంధ్ర కోసం ఓ కళాకారుడు ఎన్టీ రామారావు వేషధారణతో తన కళానైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తిరుపతిలో ఇది చోటు చేసుకుంది. తిరుపతిలో సమైక్యాంధ్ర ఉద్యమం పెద్ద యెత్తున సాగుతోంది.

తిరుపతిలో ఇలా...
వివిధ రూపాల్లో తిరుపతిలో సమైక్యాంధ్ర ఉద్యమం సాగుతోంది. ఆందోళనకారులు తమకు నచ్చిన పద్ధతిలో ఆందోళనలు సాగిస్తున్నారు.

రాష్ట్రాన్ని విడదీయవద్దు..
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రకటన చేయాలని సీమాంధ్ర ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతిలో ఇలా సమైక్యాంధ్ర ఆందోళనకారులు రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు.

సమైక్యాంధ్ర కత్తి
సీమాంధ్ర ఆందోళనకారులు తిరుపతిలో సమైక్యాంధ్ర కత్తిని ధరించి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తిరుపతిలో ఈ ఆందోళనారూపం వ్యక్తమైంది.

సమైక్యాంధ్ర నినాదం
జై సమైక్యాంధ్ర నినాదం రాసిన కత్తిని ధరించి ఓ ఆందోళనకారుడు రాష్ట్ర విభజనను వ్యతిరేకించాడు. తిరుపతిలో ఈ దృశ్యం చోటు చేసుకుంది.

సమైక్య ప్లకార్డులు..
సమైక్య ప్లకార్డులు ప్రదర్శిస్తూ తిరుపతిలో ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాంగ్రెసు అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల నిరసన
సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల వినూత్న నిరసన ఈ విధంగా తెలుపుతున్నారు.

హరీష్ రావు, కోదండరామ్, గౌడ్ ఇలా
తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు హరీష్ రావు, కోదండరామ్, గౌడ్ తెలంగాణ దీక్షలో ఇలా ముచ్చటించుకుంటూ...
విశాఖపట్నం జిల్లాలో సమైక్యాంధ్ర కోసం దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రామానాయుడు ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయనకు జాండీస్, బరువు తగ్గడం, చూపు మందగించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. దీక్ష విరమించాలని వైద్యుల సూచించినప్పటికీ రామానాయుడు నిరాకరిస్తూ దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయనను తెలుగుదేశం పార్టీ నేతలు అయ్యన్యపాత్రుడు, వెలగపూడి, కళా వెంకట్రావు పరామర్శించారు.
నెల్లూరు జిల్లాలో సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్యే రామకృష్ణ తలపెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆస్పత్రికి తరలించడంతో ఆయన అక్కడే దీక్షను కొనసాగిస్తున్నారు. ఆస్పత్రిలో రామకృష్ణను తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పరామర్శించారు. ప్రజాదరణ అధికంగా వస్తుందనే ప్రభుత్వం దీక్షను భగ్నం చేసిందని సోమిరెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications