'టిడిపి వీడటంపై హరి నెవర్, జూఎన్టీఆర్‌కు ఫ్యాన్సే అండ'

తాను కొరడాతో కొట్టుకోవడంపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. ఇదోరకం నిరసన అన్నారు. తాను ప్రజలు మెచ్చిందే చేశానన్నారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను అడ్డుకుంటానని హెచ్చరించడంపై స్పందిస్తూ.. ఆయన సినిమాలను అభిమానులే నడుపుకుంటారని చెప్పారు. అఖిల పక్ష సమావేశం తర్వాత తమ భవిష్యత్తు కార్యాచరణ చెబుతామని సుజనా చౌదరి అన్నారు.
నాన్న ఆశయ సాధన కోసమే: హరి
తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలన్నది తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయమని, ఆయన ఆశయ సాధన కోసమే తాను రాజీనామా చేశానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ శుక్రవారం చెప్పారు. అదే సమయంలో ఆయన కాంగ్రెసు పార్టీ పైన మండిపడ్డారు.
ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కోసమే కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విభజన చేసిందన్నారు. రాహుల్‌ను మెదక్ నుండి పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే తెలుగు ప్రజలను చీల్చారన్నారు. తాను పదవుల కోసం రాజీనామా చేయలేదని, నాన్న ఆశయం కోసం చేశానన్నారు.
తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలన్నది ఎన్టీఆర్ ఆశయమన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు అందరూ తన వాళ్లేనని, తనకు అందరి అభివృద్ధి కావాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అశాంతికి పూర్తి బాధ్యత కాంగ్రెసు పార్టీదే అన్నారు. తెలుగువారిని విభజించే హక్కు ఆ పార్టీకి ఎక్కడిదన్నారు. కాంగ్రెసు పార్టీ శకుని మాదిరిగా వ్యవహరిస్తోందన్నారు. తాను టిడిపిని వీడేది లేదన్నారు.
కాగా, సమైక్యాంధ్ర కోసం హరికృష్ణ గురువారం రాజీనామా చేయగా, రాజ్యసభ చైర్మన్ వెంటనే ఆమోదించిన విషయం తెలిసిందే. హరి రాజీనామాతో కేంద్రమంత్రులు, ఎంపీలు, ఇతర నేతల పైన ఒత్తిడి పడిందనే చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications