ప్రసంగాల జోరు: గుజరాత్‌లో ఛోటా మోడీ గాలి
అహ్మదాబాద్: గుజరాత్‌లో ఛోటీ మోడీ గాలి వీస్తోంది. అహ్మదాబాద్‌లోని మణినగర్‌కు చెదిన ఆరవ్ పంకజ్ నాయక్ అనే నాలుగేళ్ల బుడుతడు నరేంద్ర మోడీ కావాలని అనుకుంటున్నాడు. గుజరాత్ ముఖ్యమంత్రిగా భావించుకుని నరేంద్ర మోడీలాగే ప్రసంగాలు దంచికొడుతున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీతో అతనికి నాలుగేళ్లు వచ్చాయి. మూడేళ్ల నాలుగు నెలల నుంచే తన వక్తృత్వ పటిమను చాటుతున్నాడు.

అతని ప్రసంగం గుజరాత్ నుంచి జాతీయ స్థాయికి, అక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్తోంది. భారతీయుల ఆలోచలను అతను తన ప్రసంగాల్లో ప్రకటిస్తున్నాడు. అతను గుజరాతీలోనే కాదు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రసంగిస్తన్నాడు. ఓ నాలుగేళ్ల బాలుడు మూడు భాషల్లో చేసిన ఒక ప్రసంగమైనా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కుతుంది.

నరేంద్ర మోడీగా మారిపోయి ప్రసంగాలు చేసినందుకు ఆరవ్ ఐదు సందర్భాల్లో అవార్డులు అందుకున్నాడు. నిరుడు డిసెంబర్ నుంచి అతను ప్రసంగాలు చేస్తూ వస్తున్నాడు. అతను ఇప్పటి వరకు 8 బహిరంగ ప్రసంగాలు చేశాడు. గుజరాత్ విశ్వవిద్యాలయం కన్వెన్షన్ హాల్‌లో ఆగస్టు 15వ తేదీన అతను ప్రసంగించాడు. వేయి ముందు అతను ధారాళంగా ప్రసంగించాడు.

ఈ ఏడాది జులై 27వ తేదీన అహ్మదాబాద్ టౌన్ హాల్‌లో ఆరవ్ ప్రసంగించాడు. గురు పూర్ణమ సందర్భంగా జులై 22వ తేదీన ఇందులాల్ యాగ్నిక్ ఆశ్రమ్, నిరంత్ అశ్రమ్‌లో ప్రసంగించాడు. మణినగర్‌లోని జూ. కెజి నెల్స్ ఇంగ్లీష్ పాఠశాలలో అతను చదువుతున్నాడు. ఈ బాలుడి ప్రసంగాలు నరేంద్ర మోడీపై గుజరాత్ ప్రజల ఆకర్ణను తెలియజేస్తోంది. ఆరవ్ నాయక్ ప్రసంగాలు యూట్యూబ్‌లో ఎదరగొడుతున్నాయి. నర్సరీలో ఉన్నప్పుడు నిరుడు డిసెంబర్‌లో అచ్చం నరేంద్ర మోడీ లాగా గుజరాత్ అభివృద్ధిపై ఆరవ్ ప్రసంగం చేశాడు.












Click it and Unblock the Notifications