సోనియా తగ్గేలా లేరు, నిర్ణయం అమలే మంచిది: అసద్

Asaduddin Owaisi
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపించడం లేదని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ శనివారం అన్నారు. అయన ఇటీవల సోనియాను కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది విలేకరులు శనివారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా, విభజన ప్రక్రియ విషయంలో వెనకడుగు వేసే అవకాశం ఏ మాత్రం లేదని సోనియా స్పష్టం చేశారని తెలిపారు.

సోనియాతో చర్చించిన విషయాలను వెల్లడించబోనని చెప్పిన ఒవైసీ.. రాయల తెలంగాణ ఏర్పడుతుందో లేదో చెప్పడం కష్టమని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కృత నిశ్చయంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఉందని తేల్చి చెప్పారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని చెప్పారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం, సైబరాబాద్ ఏరియాను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే ఇక తెలంగాణకు మిగిలేది ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడమే మంచిదన్నారు.

హైదరాబాద్‌ను యూటి చేయడం కన్నా తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను యూటిచేస్తే తెలంగాణలో ముఖ్యమంత్రి కూడా కానిస్టేబుల్ చెప్పినట్లు వినాల్సి వస్తుందని, ఢిల్లీ నుంచి వచ్చిన డిజిపి రాజ్యం నడుస్తుందని, హైదరాబాద్ ఆదాయాన్ని కేంద్రం చేతుల్లో పెట్టాల్సి వస్తుందని, తెలంగాణ నిధుల కోసం కేంద్రం దయాదాక్షిణ్యాలపై వెంపర్లాడాల్సి వస్తుందని వివరించారు.

కేవలం అధికారం వస్తుందనే ఆశతో హైదరాబాద్‌ను యూటి చేసినా తమకు అభ్యంతరం లేదని తెలంగాణ మంత్రులు చెప్పడంపై ఓవైసీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను యూటిగా చేస్తుంటే తెలంగాణ ప్రజాప్రతినిధులు మౌనంగా కూర్చోవద్దన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ బలపడుతోందని, తెరాస హవా తగ్గిపోతోందని, కానీ, యూటి చేస్తే హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా తెరాస మళ్లీ బలోపేతమవుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+