Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మళ్లీ జగన్‌పార్టీలోకి వలసలు: కాంగ్‌కు కాటసాని గుడ్‌బై

Migration in to YSR Congress
హైదరాబాద్/కర్నూలు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపుకు ఇతర పార్టీల నుండి వలసలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. జగన్ పార్టీ స్థాపించినప్పుడు, ఉప ఎన్నికలలో గెలిచినప్పుడు పలువురు తెలుగుదేశం, కాంగ్రెసు నేతలు జగన్ వైపు వెళ్లారు. ఎన్నికలు దగ్గరపడుతున్నా జగన్‌కు బెయిల్ రాకపోవడంతో ఇటీవల వలసలు తగ్గాయి.

అయితే, సమైక్యం ప్రభావం కారణంగా మళ్లీ జగన్ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. ఆదివారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఉత్తరాంధ్ర నాయకుడు తమ్మినేని సీతారాం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన జగన్ పార్టీలో చేరనున్నారు. తాజాగా కర్నూలు జిల్లా కాంగ్రెసు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈయన కూడా జగన్ వైపు వెళ్లనున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యవాద పార్టీగా ముద్ర వేసుకోవడంతో సీమాంధ్రకు చెందిన పలువురు నేతలు మళ్లీ జగన్ వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఆదివారం రాజీనామా చేసిన తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. బాబు చరిత్రహీనుడని, తెలుగు జాతి విచ్ఛిన్నానికి మద్దతిచ్చారని, ఆయనకు అధికార దాహం తప్ప.. రాష్ట్రాన్ని కాపాడాలనే ఆలోచన లేదని ఆరోపించారు. బాబు లక్ష పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మరన్నరు. ఎన్టీఆర్ తర్వాత జనం నుంచి వచ్చిన నాయకుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అని, జైలులో ఉండి కూడా జగన్ దీక్ష చేస్తున్నారని కితాబిచ్చారు.

కోర్టుకు ధర్మాన, సబిత

జగన్ ఆస్తుల కేసులో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిలు సోమవారం సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. జగన్ ఆస్తులు, ఓఎంసి, ఎమ్మార్ కేసుల నిందితుల రిమాండ్ ఈ రోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో పలువురు నిందితులు కోర్టుకు హాజరయ్యారు. సమైక్యాంధ్ర కోసం జైల్లో నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌ను వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+