మోడీని అబ్బురపర్చిన లక్ష్మీప్రసన్న (సిటి భేటీ పిక్చర్స్)

హైదరాబాద్: పదిహేను రోజుల క్రితం హైదరాబాదుకు వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ‌ని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుటుంబం కలిసిన విషయం తెలిసిందే. హోటల్లో దిగిన మోడీని మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న, తనయులు మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్‌లు కలిశారు.

మోడీని మోహన్ బాబుతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కలిశారు. పార్టీలకతీతంగా టిడిపి తారలు మురళీ మోహన్, బాలకృష్ణ, కేంద్రమంత్రి చిరంజీవి బావమరిది అల్లు అరవింద్, కోట శ్రీనివాస రావు, అలీ తదితరులు కలుసుకున్నారు. సినీ ప్రముఖుల భేటీలో మోడీ స్వర్గీయ నందమూరి తారక రామారావు అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.

కాగా, హోటల్లో తనను కలిసిన మంచు లక్ష్మీ ప్రసన్న వాక్చాతుర్యం, విషయ పరిజ్ఞానం మోడీని ఆకట్టుకుందట. ఈ నేపథ్యంలో మోడీ లక్ష్మీ ప్రసన్నను ట్విట్టర్‌లో ఫాలో కావడం మొదలు పెట్టారట. దేశంలో మోడీని అనుసరించే వారు లక్షల మంది ఉండగా, ఆయన అందులో 671 మంది ప్రముఖులనే అనుసరిస్తారు. వారిలో లక్ష్మీ ప్రసన్న ఉండటం గమనార్హం. మోడీ ఫాలో అవుతున్న మహిళల్లో లక్ష్మీ 28వ వారు.

మోడీ - లక్ష్మీ

మోడీ - లక్ష్మీ

ఈ నెల 11వ తేదిన హైదరాబాద్ వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలిసిన నిర్మాత, నటి లక్ష్మీ ప్రసన్న. ఈమెను మోడీ ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు.

మోడీ - మోహన్ బాబు

మోడీ - మోహన్ బాబు

పదిహేను రోజుల క్రితం హైదరాబాదుకు వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలిసిన మోహన్ బాబు. పక్కన బిజెపి సీనియర్ నేత విద్యాసాగర రావు, లక్ష్మీ ప్రసన్న.

తనయులు

తనయులు

బిజెపి ఎన్నికల ప్రచార సారధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన తనయులు మంచు మనోజ్, మంచు విష్ణులు.

పరిచయం

పరిచయం

తన కూతురు నటి, నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్నను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి పరిచయం చేస్తున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.

శాలువా

శాలువా

గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీకి శాలువా కప్పుతున్న నటి, నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న. పక్కన మోహన్ బాబు, ఇంద్రసేనా రెడ్డి, రాఘవేంద్ర రావు తదితరులు.

శాలువా 2

శాలువా 2

గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీకి శాలువా కప్పుతున్న హీరో మంచు మనోజ్. పక్కన మోహన్ బాబు, ఇంద్రసేనా రెడ్డి, లక్ష్మీ ప్రసన్న తదితరులు.

ఫోటో

ఫోటో

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ఫోటో దిగిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు లక్ష్మీ ప్రసన్న, మంచు విష్ణు, మంచు మనోజ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+