జగన్ హెల్త్ బులెటిన్ రిలీజ్, బెయిలివ్వాలన్న శంకరన్న

జగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, బిపి, షుగర్, పల్స్ రేట్ సాధారణ స్థాయిలో ఉన్నాయని తెలిపారు. జగన్ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా, వైయస్ దీక్ష అరవై గంటలు దాటింది. అంతకుముందు జగన్‌కు ఈ రోజు ఉదయం, సాయంత్రం పరీక్షలు నిర్వహించారు.
జైలు బయట దీక్ష చేస్తా: శంకర రావు
జగన్ దీక్షకు నిరసనగా వారం రోజుల్లో తాను చంచల్ గూడ జైలు వెలుపల దీక్షకు దిగుతానని మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర రావు చెప్పారు. జైలులో ఉండి దీక్ష చేయడం తగదని ఈ విషయమై ప్రభుత్వం స్పందించాలన్నారు. జగన్ దీక్ష ఎవరున్నారో సిబిఐచే విచారణ జరిపించాలన్నారు. సెప్టెంబరు 9లోగా జగన్ పైన తుది అభియోగపత్రం దాఖలు చేయాలన్నారు. మానవా దృక్పథంతో ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. జగన్‌కు బెయిల్ ఇవ్వకుంటే తానే న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానన్నారు.
నాగం అరెస్ట్
హైదరాబాదులోని విద్యుత్ సౌధలో తెలంగాణ ఉద్యోగుల నిరసనకు సంఘీభావం తెలిపేందుకు బిజెపి నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి వచ్చారు. విద్యుత్ సౌధలోకి అయనను పోలీసులు అనుమతించలేదు. దీంతో అక్కడ వాగ్వాదం జరిగింది. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications