చెర్రీ తుఫాన్ ఫ్లెక్సీ దగ్ధం, చిరు రాజీనామాకు డిమాండ్
హైదరాబాద్: విభజన సెగ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ తుఫాన్ చిత్రానికి తగిలింది! సమైక్యాంధ్ర కోసం చిరంజీవి రాజీనామా చేయకపోవడాన్ని నిరసిస్తూ పలువురు సమైక్యవాదులు విజయనగరం జిల్లాలోని కోట జంక్షన్‌లో చెర్రీ నటించిన తుఫాన్ చిత్రం ఫ్లెక్సీని దహనం చేశారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా దేవినేని అవినాష్ అధ్వర్యంలో బందరు రోడ్డులో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు బుధవారం ఉదయం లక్షగళ గర్జనకు దిగారు. లక్ష మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి సమైక్య నినాదాలు వినిపించారు. మూడు గంటల పాటు విద్యార్థి గర్జన జరుగనుంది. ఈ కార్యక్రమానికి ఎంపి లగడపాటి రాజగోపాల్ హజరై ప్రసంగించారు.

సమన్యాయం అంటే ఏమిటో చెప్పాలి: గాలి
సమన్యాయం అంటే ఏమిటో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ ప్రజలకు వివరించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు డిమాండ్ చేశారు. సమన్యాయం పేరుతో ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. టిడిపి లేఖ ఆధారంగానే తెలంగాణ ఇచ్చామని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటిస్తే తుపరి ఏం చేయాలో తామే చెబుతామన్నారు.
విధుల బహిష్కరణ
హైదరాబాదులోని సచివాలయ ఉద్యోగులు బుధవారం తమ విధులను బహిష్కరించారు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు పోటాపోటీగా నిరసనలు, నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications