నటిపై ముగ్గురు వ్యక్తుల దాడి: ప్రేక్షకుల్లా జనం

లవలీన్ కౌర్ అనే 20 ఏళ్ల వయస్సు గల ఆ నటిపై దాడి జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. అందరూ చూస్తూ ఉండిపోయారు. ఆమె పలు ప్రజాదరణ పొందిన టీవీ కార్యక్రమాల్లో నటించింది. ఆమె ఆటో రిక్షాలో వెళ్తుండగా, ఓ వ్యక్తి ఆమె పర్సును లాక్కుని పరుగెత్తడానికి ప్రయత్నించాడు.
కౌర్ ఆటో నుంచి కిందికి దుమికి అతన్ని వెంటాడింది. పారిపోతున్న అతనికి మరో ఇద్దరు చేరారు. వారు ముగ్గురు ఆమెను చుట్టిముట్టి కొట్టడం ప్రారంభించారు. దాంతో ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఆమె అరుపులు విన్న అవుట్ పోస్టు పోలీసుల వచ్చి సహాయంగా నిలిచారు.
దాడిచేసినవారిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. మూడో అనుమానితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహిళా ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం జరిగి ముంబైలో మహిళల రక్షణపై తీవ్రమైన చర్చ సాగుతున్న తరుణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications