వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పంటే రాజీనామాకు సిద్ధం: చిరంజీవి హర్ట్ అయ్యారు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమ నిర్ణయం తప్పంటే తాను రాజీనామాకు కూడా వెనుకాడే ప్రసక్తి లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి గురువారం అన్నారు. ఈ రోజు ఢిల్లీలో ఎపిఎన్జీవోలు, సచివాలయ ఉద్యోగులు సీమాంధ్ర కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఉద్యోగులు నేతలను నిలదీశారు.

దీనికి స్పందించిన చిరంజీవి... అందరితో పాటు తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తమ పార్టీ అగ్రనేతలు తెలంగాణపై సిడబ్ల్యూసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేమని చెప్పినందుకే రాష్ట్ర రాజధాని హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయమని కోరుతున్నానని చెప్పారు.

Chiranjeevi

తమ నిర్ణయం తప్పంటే రాజీనామా చేసేందుకు కూడా తాను వెనుకాడేది లేదని చెప్పారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లింది తానేనని చెప్పారు. విభజన అనివార్యమైతే హైదరాబాదును యూటి లేదా శాశ్వత రాజధానిగా చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.

కాంగ్రెసుపై గాలి నిప్పులు

కాంగ్రెసు పార్టీ, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సృష్టించిందే తెలంగాణ సమస్య అని టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విజయవాడలో ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలను కలుపుకునేందుకు కాంగ్రెసు రాజకీయ నాటకాలాడుతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని చీల్చే హక్కు కాంగ్రెసు పార్టీకి లేదన్నారు.

English summary

 The Central Toursim Minister on Thursday told Seemandhra employees that he is ready to resign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X