రీతూ వర్మ చేతులతో పోచంపల్లి ఆర్ట్ మేళా (పిక్చర్స్)
హైదరాబాద్: నల్లగొండ జిల్లాలోని పోచంపల్లి చేనేత కారులు ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. పోచంపల్లి చేనేత కార్మికులు చేనేత ఉత్పత్తులను అత్యంత కళాత్మకంగా రూపొందిస్తారని విషయం ప్రపంచానికి తెలుసు. వారి ఉత్పత్తులను ప్రదర్శించే పోచంపల్లి చేనేత ఇక్కత్ ఆర్ట్ మేలా 2013 ఈ నెల 30వ తేదీన జరుగుతుంది.
ఆ మేళా కుషాయిగుడాలోని ఇసిఐఎల్ చౌరస్తాలో గల జాతీయ లఘు పరిశ్రమల సంస్థ (ఎన్ఎస్ఇసి) ఎగ్జిబిషన్ సెంటర్‌లో కొలువుదీరనుంది. సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఈ మేళా కొనసాగుతుంది. వీవర్స్ రూపొందించిన సిల్క్ అండ్ కాటన్, బెడ్ షీట్స్, స్టోర్స్, డ్రెస్ మెటీరియల్స్ వంటి రకరకాల ఉత్పత్తులను ఈ మేళాలో ప్రదర్శిస్తారు.
ఈ మేళాలో చేనేత కార్మికులు రూపొందించిన వందల రకాల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు హ్యాండ్లూమ్ పార్క్ సిఇవో దామోదర్ తెలిపారు. శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటలకు నటి రీతూ వర్మ మేళాను ప్రారంబిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇలా ప్రదర్శన
పోచంపల్లి చేనేత ఇక్కత్ మేళాలో ప్రదర్శనకు ఇలా సిద్ధమైన దుస్తులు.. ఈ ప్రదర్సనలో రంగురంగుల కళాత్మక చేనేత వస్త్రాలను చూడవచ్చు.

మగ్గం మీద మహిళ చేనేత
సికింద్రాబాదులోని పోచంపల్లి ఇక్కత్ చేనేత ఆర్ట్ మేళాకు సిద్ధపడుతున్న పోచంపల్లి కార్మికురాలు. పోచంపల్ల చేనేత ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచాయి.

లైవ్ డిమానిస్ట్రేషన్
కుషాయిగుడా పోచంపల్లి ఇక్కత్ మేళాకు సిద్ధపడుతున్న చేనేత కార్మికులు. లైవ్ డిమానిస్ట్రేషన్ ఇచ్చారు. ఈ చిత్రం చూడండి.

ఇక్కత్ హాండ్ల్యూమ్ మేళా
పోచంపల్లి చేనేత ఉత్పత్తులకు ఎక్కడలేని గిరాకీ ఉంటుంది. ఈ దస్తులన్నీ ఈ నెల 30వ తేదీన ఇక్కత్ మేళాలో దర్శనమిస్తాయి.












Click it and Unblock the Notifications