తులసిరెడ్డి పైకి చెప్పు: మీసం మెలేసి, తొడగొట్టి సవాల్

 Tulasi Reddy angry on agitators
హైదరాబాద్/కడప: కాంగ్రెసు పార్టీ సీనియర్, 20 సూత్రాల పథకం చైర్మన్ నేత తులసి రెడ్డికి బుధవారం కోపం వచ్చింది. తన పైకి కొందరు చెప్పులు విసరడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన తొడగొట్టి సవాల్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో పుట్టపర్తి సర్కిల్ వద్ద దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తులసి రెడ్డిని మరో శిబిరం వద్ద ఉన్న కొంతమంది నిలదీశారు.

తులసి రెడ్డి గో బ్యాక్... వెళ్లిపో.. వెళ్లిపో అంటూ నినాదాలు చేశారు. తులసి రెడ్డి మాట్లాడుతున్న సమయంలో కొందరు.. ప్రసంగించవద్దని, రాజీనామాను ఆమోదింప చేసుకోకుండా దొంగాట ఆడుతున్నారని కేకలు వేశారు. ఈ సమయంలో తులసి రెడ్డి ఎదురుగా ఉన్న శిబిరం వైపుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. అది కుదరలేదు.

దీంతో అక్కడే ఉన్న అతను.. తాను ఎవరినీ విమర్శించనని, ఎవరి అజెండా వారిదన్నారు. తాను సమైక్యాంధ్ర కోసం మొదటి నుండి పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అదే స్ఫూర్తితో పని చేస్తున్నానన్నారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన వెంటనే మొదట రాజీనామా చేసింది తానే అన్నారు. ఆ తర్వాత తాను తన వాహనం ఎక్కే ప్రయత్నం చేశారు.

అంతలోనే ఒకరు ఆయన వాహనంపై చెప్పు విసిరారు. దీనిపై తులసి రెడ్డి తీవ్రంగా స్పందించారు. వాహమెక్కిన ఆయన బయటకు నిలబడి.. మీసం దువ్వి తొడగొట్టారు. రండి తేల్చుకుందామంటూ ఆగ్రహించారు. పోలీసుల జోక్యం తో పరిస్థితి సద్దుమణిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+