షర్మిల యాత్ర ఖరారు: సమైక్యవాదులమని విజయమ్మ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల సెప్టెంబర్ 2వ తేది నుండి చేపట్టబోయే బస్సు యాత్రకు సమైక్య శంఖారావం అని పేరు పెట్టారు. షర్మిల బస్సు యాత్ర సోమవారం కడప జిల్లా ఇడుపులపాయ నుండి ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో విజయమ్మ ఆదివారం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఓట్లు, సీట్లు ప్రాతిపదికన విభజన నిర్ణయం జరిగిందని ఆమె తన లేఖలో ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యవాద పార్టీ అని పేర్కొన్నారు. సమైక్యాంధ్రకు సిపిఎం, మజ్లిస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కట్టుబడి ఉన్నాయన్నారు.

కాంగ్రెసు, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, సిపిఐలు విభజనవాద పార్టీలు అని నిందించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని సమైక్యం వైపు రమ్మన్నా రాలేదని, విభజనను అడ్డుకోకుంటే ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. అడ్డగోలుగా విభజన నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.
సమైక్యం కోసం షర్మిల యాత్ర మరో ముందడుగు అన్నారు. వైయస్ జగన్ ఎప్పుడు ప్రజల పక్షాన్నే నిలిచారన్నారు. జగన్ రాష్ట్రాన్ని ప్రాణం కంటే మిన్నగా భావించారన్నారు. జగన్ నాయకత్వంలో ఎపి అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్ నీతి, నిజాయితీ గల రాజకీయం చేశారన్నారు. తాము ప్రధానికి లేఖ ఇచ్చినట్లుగా సమైక్యంకు కట్టుబడి ఉన్నామన్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications