బాలికపై లైంగిక దాడి: అర్ధరాత్రి ఆశారాం బాపు అరెస్ట్

ఇండోర్: బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును ఇండోర్‌లోని ఆయన ఆశ్రమంలో శనివారం అర్ధరాత్రి జోధ్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతంర ఆశ్రమం నుండి ఇండోర్ విమానాశ్రయానికి తీసుకు వచ్చి, అక్కడి నుండి జోధ్‌పూర్‌కు తరలించారు.

ఆశారం బాబు సహా పదమూడు మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆశారాం బాపు అరెస్టు సమయంలో ఆశ్రమంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఆశారాం బాపును విచారించడం కోసం వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 72 ఏళ్ల ఆశారాం ఆరోగ్యంగానే ఉండడంతో వెంటనే ఆయనపై విచారణ ప్రారంభమవుతుందని పోలీసులు తెలిపారు.

Sexual assault accused Asaram Bapu arrested, flown to Jodhpur

ఆశారాం బాపు ఇండోర్‌లోని తన ఆశ్రమంలోనే ఉన్నట్లు గుర్తించిన పోలీసులు శనివారం అక్కడకు చేరుకున్నారు. ఎనిమిది గంటలకు పైగా అక్కడే నిరీక్షించారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో ఆయనను అరెస్టు చేశారు.

కాగా, ఆశారాం బాపుపై ఢిల్లీ పోలీసులు లైంగిక దాడి ఆరోపణలపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఓ 16 ఏళ్ల బాలికపై ఆయన లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు మధ్య ఢిల్లీలోని కమలా మార్కెట్ పోలీసు స్టేషన్‌లో 376 సెక్షన్ కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+