కాంగ్రెస్, టిడిపి పోటీ: సోనియా మెడకు తాడు (పిక్చర్స్)
హైదరాబాద్: సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సీమాంధ్రలో 34వ రోజు ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. సమైక్యవాదులు ప్రజాప్రతినిధులను అడ్డుకొని రాజీనామాలు చేయాలని పట్టుబడుతున్నారు. రాజీనామా చేయకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనవద్దని హెచ్చరిస్తున్నారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురం జిల్లా ధర్మవరంలో శ్రీ పొట్టి శ్రీరాములు కూడలిలో లక్షగళార్చన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భారీగా సమైక్యవాదులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి దీనిని ఏర్పాటు చేసింది. ధర్మవరం-పుట్టపర్తి మార్గంలో జనప్రవాహం కనిపించింది.
సమైక్యాంధ్ర కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టనున్న సమైక్య శంఖారావ యాత్ర ఈ రోజు ప్రారంభమవుతుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది.

కాంగ్రెస్.జివిఎంసి
సమైక్యాంధ్రకు మద్దతుగా గ్రేటర్ విశాఖ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆందోళన చేస్తున్న దృశ్యం. ఈ దీక్షలో కాంగ్రెసు నాయకులతో పాటు పలువురు సమైక్యవాదులు పాల్గొన్నారు.

జివిఎంసి
సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ విశాఖలో ద్విచక్ర వాహన ర్యాలీని తీస్తున్న దృశ్యం. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

ఎండిపి
సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖలో తెలుగు తల్లి ఎదుట కోలాటం ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్న విద్యార్థినులు. విభజనను అంగీకరించేది లేదంటూ నిరసన తెలిపారు.

టిడిపి.జివిఎంసి
కాంగ్రెసు పార్టీ విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోటోకు తెలుగుదేశం పార్టీ తాడుతో ఉరి వేస్తున్న దృశ్యం.

టిడిపి.జివిఎంసి
సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలుపుతున్న దృశ్యం. టిడిపి అభిమానులు తలకిందులుగా నడుస్తూ నిరసన తెలిపారు.

విడిఎస్‌కెఏ.జివిఎంసి
విభజన వద్దు.. సమైక్యం ముద్దు, ఆంటోనీ కమిటీ కంటి తుడుపు కమిటీ, జై సమైక్యాంధ్ర అంటూ విడిఎస్‌కెఏ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న దృశ్యం.

ఛలో హైదరాబాద్
ఈ నెల 7వ తేదిన హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అవగాహన సదస్సు పోస్టర్‌ను విడుదల చేస్తున్న సమైక్య రాష్ట్ర సంరక్షణ వేదిక.

తెలంగాణ లంబాడా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ తెలంగాణ లంబాడా ప్రజా సమితి ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద దీక్ష చేస్తున్న దృశ్యం.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications